Friday, April 26, 2024
- Advertisement -

రాజమౌళి ప్రస్టేటెడ్‌ డైరెక్టర్‌

- Advertisement -

రాజమౌళి జూనియర్‌ ఎన్‌టీఆర్, రామ్‌ చరణ్‌లతో నిర్మిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ట్రైలర్‌ రికార్డులను బద్దలు కొడుతోంది. జనవరి 7న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం దేశ ‍వ్యాప్తంగా పలుచోట్ల ప్రెస్‌మీట్‌లను నిర్వహిస్తోంది. ఇందులో పలు ఆసక్తి కర విషయాలు వెల్లడవుతున్నాయి.అయితే రాజమౌళి ఎన్‌టీఆర్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్‌ నంబర్‌ 1 నుంచి నేటి ట్రిపుల్‌ ఆర్‌ సినిమా వరకు ఇ‍ ద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వచ్చాయి. రాజమౌళి అత్యధి‍కంగా సినిమాలు చేసింది ఎన్‌టీఆర్‌తోనే.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్‌ ప్రెస్‌మీట్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. చేసే పనిపై వంద శాతం ఫోకస్‌ను పెట్టి సినిమాను తీస్తానని అన్నారు. సినిమా ఒక్కసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాక వారే అంతిమ నిర్ణేతలని చెప్పారు. ఆ తర్వాత అది హిట్టా, ప్లాపా అనేది మన కంట్రోలులో ఉండదని తెలిపారు. నీపని నువ్వు శ్రద్ధగా చేయి ఫలితం గురించి ఆలోచించకు అనే గీతాచార్యుడి సూక్తిని తాను నమ్ముతానని అన్నారు.

తనకు ఎప్పుడు కోపం రాదని ఎరరిమీదా తాను ప్రస్టేషన్‌ చూపనని అంటూ పక్కనే ఉన్న జూ. ఎన్‌టీఆర్‌ను, రామ్‌చరణ్‌ను మీపై ఎప్పుడైనా ప్రస్టేషన్‌ చూపానా అని అడిగారు. ఎన్‌టీఆర్‌ స్పందిస్తూ జక్కన్నా యువర్‌ ఏ ప్రస్టేషన్‌ డైరెక్టర్‌.. అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. తాను అనుకున్న విధంగా షాట్‌ వచ్చే వరకు రాజమౌళి కాం‍ప్రమైజ్‌ కారని చెప్పారు. ఇందుకోసం మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టే వారని.. అందుకే యువర్‌ ఏ ప్రస్టేటెడ్‌ డైరెక్టర్ అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.

అప్పటి వరకు మహేష్‌తో సినిమా చేయను: రాజమౌళి

అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు!

చలికాలంలో పాదాల పగుళ్లు వేధిస్తున్నాయా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -