- Advertisement -

అప్పటి వరకు మహేష్‌తో సినిమా చేయను: రాజమౌళి

- Advertisement -

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్‌ ఆక్టివిటీలో బిబీ బిజీగా ఉన్నారు. ఇదివరకే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం ముంబై, చెన్నై, బెంగళూరులలో ప్రెస్‌మీట్‌లను నిర్వహించింది. కాగా తాజాగా శనివారం హైదరాబాద్‌లో సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ను నిర్వహించింది. జూనియర్‌ ఎన్‌టీఆర్, రామ్‌ చరణ్‌ కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రధారులుగా తెరకెకుక్కుతున్న ఈ చిత్రంను జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రీజర్‌ దుమ్మురేపుతోంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్‌ మీట్‌లో తదుపరి సినిమా మహేష్‌ బాబుతో ఎప్పుడు తెర కెక్కించబోతున్నారు అని రాజమౌళిని ఓ రిపోర్టర్‌ అడడగా రాజమౌళి స్పందించారు. ప్రస్తుతం తాను పూర్తిగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించే ఆలోచిస్తున్నానని చెప్పారు. వేరే విషయాల గురించి ఆలోచించే సమయం లేదని, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందకు వచ్చిన తర్వాతే వేరే సినిమాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు.

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తర్వాతి చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం విజయేంద్రప్రసాద్‌ ఒక కథను సైతం సిద్ధం చేశారు. ప్రస్తుతం మహేష్‌బాబు పరశురాం దర్శకత్వంతో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు.

టాలీవుడ్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

ప్రభాస్ వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

టాలీవుడ్ హీరోల పెళ్లిలు, ఖర్చు, కట్నాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -