Saturday, April 20, 2024
- Advertisement -

త్వరలో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ మూవీ

- Advertisement -

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి… యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా రాబోతోందని ఫిలింనగర్‌ టాక్. అనిల్ దగ్గర మంచి కథ ఉందని ఎన్టీఆర్‌కు నిర్మాత దిల్ రాజు చెప్పారట. అది విన్న ఎన్టీఆర్ సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చెప్పాడట. కల్యాణ్ రామ్ పటాస్‌ తోనే అనిల్ దర్శకుడిగా మారాడు. ఇప్పుడు మరోసారి నందమూరి హీరోలతో సినిమా చేసినట్లు అవుతుంది.

త్వరలో బాలకృష్ణ తోనూ ఆయన మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ మూవీ తర్వాతే ఎన్టీఆర్‌తో సినిమాను పట్టాలెక్కించనున్నారు. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్‌ది డబుల్ యాక్షన్ అని తెలుస్తోంది. అనిల్ మార్క్ కామెడీతో పాటు ఎన్టీఆర్ రేంజ్ మాస్ యాంగిల్ ఈ సినిమాలో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్౩ తో బిజీగా ఉంటే.. ఎన్టీఆర్ త్వరలో కొరటాలతో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. తర్వాత బుచ్చిబాబు సానాతో మరో మూవీ చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత అనిల్‌తో సినిమా పట్టాలెక్కనుంది.

ఆర్ఆర్ఆర్ ను వాడేసుకున్న ఆర్జీవీ

సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారా ?

రామ్ చరణ్ ది గొప్ప మనసు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -