Wednesday, May 8, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ ను వాడేసుకున్న ఆర్జీవీ

- Advertisement -

సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో రామ్ గోపాల్ వ‌ర్మ‌కు మించిన వారు లేరంటారు. వివాదాలు, సంచ‌ల‌నాల‌ను సైతం త‌న‌కు అనుకూలంగా మార్చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు..ట్రెండింగ్ లో ఉన్న ప్ర‌తి అంశాన్ని త‌న సినిమా ప్ర‌చారానికి వాడేసుకోవ‌డంలో వ‌ర్మ దిట‌. తాజాగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ ను సైతం త‌న కొత్త మూవీ కోసం వాడేసుకున్నారు. రామ్ గోపాల్ వ‌ర్మ లేటెస్ట్ మూవీ డేంజ‌ర‌స్. తెలుగులో ‘మా ఇష్టం’పేరుతో విడుదలవుతోంది.

ఈ సినిమా ప్ర‌చారంలో డేంజ‌ర‌స్ మూవీకి ఆర్ఆర్ఆర్ ను లింక్ చేస్తూ వ‌ర్మ ట్వీట్ చేశారు. ‘రాజమౌళి.. మీకు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ లాంటి డేంజరస్‌ బాయ్స్‌ ఉంటే.. నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్‌ అమ్మాయిలు ఉన్నారు’ అంటూ ఆయ‌న చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ రాజ‌మౌళి క‌లిసి ఉన్న ఫోటోతో పాటు ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఉన్న త‌న ఫోటోను జ‌త‌చేశారు ఆర్జీవీ.

ప్ర‌స్తుతం ఈ ట్వీట్ తెగ వైర‌ల్ అవుతోంది. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా.. ఏప్రిల్‌ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ క‌థాంశంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

పట్టుబట్టి ఆ డైరెక్టర్ ను మార్పించిన సమంత

సమంతకు షాక్ ఇచ్చిన దర్శకుడు

బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ టాప్ హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -