Saturday, April 27, 2024
- Advertisement -

మెగాస్టార్ కమిట్‌మెంట్ పై ప్రశంసలు

- Advertisement -

మెగా స్టార్ కమిట్మెంట్ గురించి ఇండస్ట్రీలో చాలా మందే చెబుతుంటారు. ఆయన ఎంత కష్టాన్నైనా ఇష్టంగా భావిస్తుంటారి అంటుంటారు. కెరీర్ మొదలు నుంచి చిరంజీవి అంతేనట. సినమాపై అంకిత భావం, కష్టపడే మనస్తత్వం ఆయన్ను ఆదర్శంగా నిలబెడుతూ ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఘటన మెగా స్టార్ కమిట్ మెంట్‌ను మరోసారి అందరికీ గుర్తు చేసింది. ప్రస్తుతం ఆచార్య సినిమా పూర్తి చేసిన చిరు మరో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు.

కె.ఎన్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. ‘వాల్తేరు శ్రీను’ అనే పేరు ఈ సినిమాకు పరిశీలనలో ఉంది. హైదరాబాద్‌లో ఇటీవలే చిరంజీవిపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. అందులో ఏనుగుపై సవారీ చేసే సన్నివేశం ఉందట. ఏనుగుపై షూటింగ్‌ చేస్తుండగా.. కిందకి దిగే క్రమంలో జారి పడ్డారని, కాలికి గాయం కావడంతో పాటు బెణికిందట.

అయినా సరే ఆ నొప్పిని తట్టుకొని ఆ రోజు షూటింగ్‌ పూర్తి చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దెబ్బ తగిలిందని షూటింగ్ నుంచి వెళిపోతే ఇతర నటీనటుల కల్షీట్లు వృథా అవుతాయని భావించి ఆ సీన్ పూర్తి చేశారని చెబుతున్నారు. దాంతో అంతా చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

కళాకారులుగా మారిపోయిన ఖాకీలు

మహేశ్‌ బాబుతో రాజమౌళి సినిమా… రిలీజ్ ఎప్పుడంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -