Saturday, May 4, 2024
- Advertisement -

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో జునియ‌ర్ ఎన్టీఆర్‌

- Advertisement -

వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ రెండో భార్య ల‌క్ష్మీ పార్వ‌తి ఆయ‌న జీవితంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని ఈ సినిమాను తీస్తున్నాడు వ‌ర్మ.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన వెన్నుపోటు సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తాను తీయ‌బోయేదే అస‌లైన ఎన్టీఆర్ జీవిత క‌థ అని గ‌ట్టిగా చెబుతున్నాడు వ‌ర్మ‌. ఎన్టీఆర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లోని ఎన్టీఆర్ లుక్‌ను ప్రేక్ష‌కుల‌కు పరిచియం చేశాడు వ‌ర్మ‌. తాజాగా ఈ సినిమా గురించి మ‌రో ఆప్డేట్‌ బ‌య‌టికి వ‌చ్చింది. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో జునియ‌ర్ ఎన్టీఆర్ గురించి చెబుతాడ‌ట వ‌ర్మ‌. ఎన్టీఆర్ బ్ర‌తికి ఉన్న రోజుల‌లో హ‌రికృష్ణ రెండో భార్య శాలిని గురించి ఎన్టీఆర్‌కు మొద‌ట చెప్పింది ల‌క్ష్మీ పార్వ‌తి అని చెబుతుంటారు. ఇదే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి కూడా స్పష్టం చేసింది.

అయితే ల‌క్ష్మీ పార్వ‌తి అంటే జునియ‌ర్ ఎన్టీఆర్‌కు అస‌లు ఇష్టం ఉండేది కాద‌ట‌. లక్ష్మీపార్వతి మీద ఉన్న కోపంతో జునియ‌ర్ ఎన్టీఆర్ ఇంట్లో ఉన్న లక్ష్మీపార్వతి ఫోటోలన్నీ చించేశాడని తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న‌లు అన్ని త‌న సినిమాలో వాడుకుని సినిమాకు హైప్ తీసుకురావ‌ల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు వ‌ర్మ‌. మ‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయే లేదో చూడాలి అంటే మ‌రి కొంత కాలం ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -