Monday, May 6, 2024
- Advertisement -

వంగ‌వీటి రాధాకు అంత సీన్ లేదా.. అందుకే జ‌గ‌న్ రాధాను ఒదులుకున్నాడా..?

- Advertisement -

వంగ‌వీటి మోహ‌న రంగా …ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. 1985 ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మైన నాయ‌కుల‌లో వంగ‌వీటి మోహ‌న రంగా ఒక‌డు. ఆ త‌రువాత ఆయ‌న మ‌ర‌ణం, ఆయ‌న కొడుకు వంగ‌వీటి రాధా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వ‌న్ని అంద‌రికి తెలిసిందే. తండ్రి వార‌స‌త్వంతో తెలిగ్గానే రాధా పొలిటికల్ ఎంట్రీ దొరికిన‌ట్లు అయింది. అప్ప‌టి కాంగ్రెస్ సీఎల్పీ లీడ‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అండ‌దండ‌లు కూడా రాధాకు పుష్క‌లంగా ఉండంటంతో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు నుంచి పోటీ చేసి మొట్ట మొద‌టిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు రాధా.

ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది కాని,2009 వ‌చ్చే స‌రికి సీన్ పూర్తిగా మారిపోయింది. కాపు కుల‌స్థుల‌డైన హీరో చిరంజీవి ప్ర‌జ‌రాజ్యం పెట్ట‌డంతో ఆ పార్టీలో చేరాడు రాధా. అప్పుడు సీఎంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ రాధాను పిలిచి మ‌రి పార్టీ మారొద్ద‌ని స‌ర్థిచెప్పిన‌ప్ప‌టికి రాధా ప్ర‌జారాజ్యం పార్టీలో చేరారు. ఇది రాధా రాజ‌కీయ జీవితంలో దిద్దుకోలేని త‌ప్పుగా మిగిలిపోయింది. అప్ప‌టికే ప్ర‌జ‌ల‌లో వైఎస్ఆర్ మీద అభిమానం ఎక్కువుగా ఉంది. 2009 జ‌రిగిన ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. చిరంజీవి ప్ర‌జ‌రాజ్యం పార్టీ కేవ‌లం 18 సీట్ల‌కే ప‌రిమితం అయింది. కులం కార్డుతో ఎన్నిక‌ల‌కు వెళ్లిన వంగ‌వీటి రాధాను ప్ర‌జ‌లు ఘోరంగా ఓడించారు. ఆ స‌మ‌యంలో రాధా త‌న స‌న్నిహితుల వ‌ద్ద పార్టీ మారి త‌ప్పు చేశాన‌ని , కాంగ్రెస్‌లో ఉండి ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడిన‌ని, మంత్రిగా కూడా ప‌నిచేసే చాన్స్ వ‌చ్చేద‌ని వాపోయాడ‌ట రాధా.

వైఎస్ఆర్ మ‌ర‌ణం ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు అనంత‌రం చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో వీలినం చేయడం, రాధా పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చి వైఎస్ఆర్‌సీపీ చేర‌డం అన్ని చ‌కచ‌కా జ‌రిగిపోయాయి. 2014 సెంట్ర‌ల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రాధా. గ‌త కొంత‌కాలంగా వైసీపీలో తీవ్ర అంస‌తృప్తితో ఉన్న రాధా వైసీపీకి ఆదివారం రాజీనామ చేశారు. ఇప్ప‌టికే రెండుసార్లు ఓడిపోయి రంగా ప‌రువు పొగొట్టిన రాధా ముచ్చ‌ట‌గా మూడోసారి ఓటమి రెడీ అయ్యారని అంటున్నారు విజ‌య‌వాడ వాసులు. ఒక‌ప్పుడు రంగా విజ‌య‌వాడ‌ను ప్ర‌భావితం చేశారు కాని, రాధాకి అంత సీన్ లేద‌ని వారి అభిప్రాయంగా తెలుస్తోంది. అంత సీన్ ఉండి ఉంటే వ‌రుస‌గా రెండుసార్లు ఎలా ఓడిపోతార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఏ పార్టీ అయిన గెలిచే సీటు ఇస్తుంది కాని ఓడిపోయే సీటు ఎలా ఇస్తుంద‌ని వైసీపీ పార్టీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నారు.

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి రాధా క‌న్నా బ‌ల‌మైన నేత మ‌ల్ల‌ది విష్ణు ఉన్న‌ప్పుడు ఆయ‌నను కాద‌ని , రాధాకి ఎలా సీటు ఇస్తారు, పైగా అక్క‌డ మ‌ల్ల‌ది విష్ణుకు బ‌ల‌మైన క్యాడర్ ఉంది. 2009లో రాధాపై మ‌ల్లది విష్ణు దాదాపు 20 వేల‌ ఓట్ల‌తేడాతో గెలిచాడు, రాధా సామాజిక వ‌ర్గం అప్పుడు ఏమైందని వైసీపీ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికి రాధా వైసీపీ పార్టీ వీడి త‌ప్పు చేశార‌ని రంగా అభిమానులే భావించ‌డం విశేషం. 2009లో చేసిన త‌ప్పే రాధా మ‌ళ్లీ చేశార‌ని వారు అంటున్నారు. అప్పుడు కూడా ఇలాగే గెలిచే పార్టీ నుంచి బ‌య‌టికి వ‌చ్చారు. ఇప్పుడు కూడా 2019లో జ‌రిగే ఎన్నిక‌ల‌లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుందని అన్ని స‌ర్వేలో చెబుతున్న త‌రుణంలో రాధా ఇలా పార్టీ నుంచి బ‌య‌టికి రావ‌డం ఎవ‌రికి న‌చ్చ‌డం లేదు. రాధా త‌న రాజకీయ స‌మాధిని తానే త‌వ్వుకున్నాడని ఆయ‌న స‌న్నిహితులే చెప్పుకుంటున్నారు. రాధా టీడీపీలో చేర‌తార‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి, ఇది జరిగే పరిస్థితి లేదు. టీడీపీ పార్టీ త‌న తండ్రి రంగాను చంపిందని రాధానే చాలాసార్లు బ‌హిరంగంగా విమ‌ర్శించారు. మరి అలాంటి పార్టీలో రాధా ఎలా చేర‌తాడు.

ఇక రాధాకు మిగిలింది ప‌వ‌న్ జ‌న‌సేన ఒక్క‌టే. ఇద్ద‌రు కాపు కులం కావ‌డంతో రాధా జ‌న‌సేన‌లో చేరే అవకాశాలు ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి. అయితే రాధా ప‌ట్టుప‌డుతున్న విజ‌య‌వాడ సెంట్ర‌ల్లో జ‌న‌సేన‌కు అంత బ‌లం లేదు. రాధాకు బ‌లం ఉందా అంటే ..ఉంటే రెండు సార్లు ఎందుకు ఓడిపోతాడ‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. రాధా వైసీపీని వీడ‌టం వ‌ల్ల విజ‌య‌వాడ సెంట్ర‌ల్లో ఆ పార్టీ కాస్తా బ‌ల‌హీనం అవ్వ‌డం అయితే ఖాయం. ఇక్క‌డ ఇప్ప‌టికే టీడీపీ జెండా ఎగురుతోంది. దీంతో ఈసారి ఎలాగైన అక్క‌డ వైసీపీ గెల‌వాల‌ని భావిస్తుంది. దీంతోనే రాధాకు అక్క‌డ బ‌లం లేద‌ని గ్రహించి, మ‌ల్ల‌ది విష్ణును రంగంలోకి దింపింది వైసీపీ. అందుకే రాధాను వ‌దులుకోవ‌డానికి సైతం వైసీపీ మొగ్గు చూపింది. ప్ర‌స్తుతానికి అయితే రాధ రెండు రోజుల్లో త‌న రాజ‌కీయ భవిష్య‌త్తు ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -