Saturday, May 4, 2024
- Advertisement -

NTR30 : గెట్ రెడీ టైటిల్ అనౌన్స్ మెంట్.. ఎప్పుడంటే ?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఈ ఏడాది ” ఆర్ ఆర్ ఆర్ ” వచ్చి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో కలిసి మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ కి కమిటైన సంగతి తెలిసిందే. ” NTR30 ” వర్కింగ్ టైటిల్ లో ఉన్న ఈ మూవీ అనౌన్స్ మెంట్ జరిగి ఏడాది గడచినప్పటికి.. మూవీకి సంబంధించిన ఏలాంటి అప్డేట్ రాలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ పై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. కథపై ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో కథకు కొరటాల మరింత మెరుగులు దిద్దుతున్నాడని టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్.

ఒకానొక దశలో మూవీ ఆగిపోయిందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తాల ప్రకారం.. ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చేందుకు చిత్రాయునిట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ దీపావళి కానుకగా మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసేందుకు చిత్రాయునిట్ ప్లాన్ చేస్తోందట. దీనిపై ఏలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఆ మద్య వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన కొరటాల శివ.. గత చిత్రం ” ఆచార్య ” తో డీలా పడ్డాడు. అంతే కాకుండా ఎన్నో విమర్శలను కూడా మూటగట్టుకున్నాడు. దీంతో ” NTR30 ” మూవీతో ఎలాగైనా విజయం సాధించి తిరిగి ఫామ్ లోకి రావాలని కొరటాల చూస్తున్నాడు. మరి గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ” జనతా గ్యారేజ్ ” బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతో వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈసారి ఈ క్రేజీ కాంబినేషన్ ఏలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

విజయ్ కి “వినయం” వంటబడుతుందా ?

గజిని సిక్వల్ కోసం.. పోటీలో సూర్య, అల్లు అర్జున్ ?

చిరు vs బాలయ్య .. బిగ్ ఫైట్ మిస్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -