Monday, April 29, 2024
- Advertisement -

మహేశ్ కు విలన్ గా కార్తీ.. రాజమౌళి అదిరిపోయే ప్లాన్ !

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనౌన్స్ మెంట్ అయిన ఈ ప్రాజెక్ట్ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతో కాలంగా ఉరిస్తున్న ఈ కాంబినేషన్.. ఎట్టకేలకు ఒకే కావడంతో మహేశ్ బాబు అభిమానుల ఆనందనికి హద్దే లేదని చెప్పాలి. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆ మద్య రాజమౌళి హింట్ ఇచ్చారు కూడా. తాను మహేశ్ తో చేయబోయే మూవీ ” యాక్షన్ అడ్వంచర్ గ్లోబ్ ట్రిక్కింగ్ మూవీ ” అంటూ రాజమౌళి వరల్డ్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. దీంతో ఈసారి మహేశ్ మూవీతో రాజమౌళి పాన్ వరల్డ్ పై గురిపెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఎపిక్ అడ్వంచర్ మూవీగా రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ను తీర్చి దిద్దబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంచితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రస్తుతం ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. ఈ మూవీ లో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం తమిళ్ స్టార్ హీరో కార్తీ తో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నాడట. అది కూడా విలన్ పాత్ర అని సమాచారం. ఇక రాజమౌళి సినిమాలో విలన్స్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

హీరో కు మించిన విధంగా విలన్ పాత్రలు తీర్చిదిద్దడంలో రాజమౌళి స్టైలే వేరు. ఉదాహరణకు బాహుబలి లో భాళ్లాలదేవ, ఈగ లో కిచ్చ సుదీప్ వంటి హీరోలు చేసిన పాత్రలను చెప్పుకోవచ్చు. ఇక రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు ప్రతిహీరో కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. దీంతో ఒకవేళ రాజమౌళి తమిళ్ స్టార్ హీరో కార్తీతో సంప్రదింపులు జరిపి ఉంటే.. కార్తీ కచ్చితంగా ఒప్పుకునే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమైన ఎన్టీఆర్ ?

శ్రీను వైట్ల కొత్త ప్రయోగం.. ఫలించేనా ?

ఎన్టీఆర్ కోసం రంగంలోకి బడా హీరో.. కొరటాల భారీ స్కెచ్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -