Monday, April 29, 2024
- Advertisement -

కాంగ్రెస్, వైసీపీతో పొత్తు.. మరి జగన్ ఒప్పుకుంటారా ?

- Advertisement -

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన వస్తే 2014 కంటే ముందు.. 2014 తరువాత అని చెప్పుకోవాలి. 2014 ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో బలమైన పార్టీగా స్థిరమైన క్యాడర్ ఉండేది. అయితే 2014 ఎన్నికల ముందు చోటు చేసుకున్నా పరిణామాలు ఆ పార్టీ పునాదులను పేకమేడల్లా కూల్చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేయడంతో కాంగ్రెస్ పై ఏపీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఆ ప్రభావం 2014 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. విభజన హామీలతో ఏపీకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఇక ఆ తరువాత పార్టీలోని బలమైన నేతలంతా కూడా ఇతర పార్టీల గూటికి చేరడంతో కాంగ్రెస్ మెల్లమెల్లగా క్షీణించింది. .

ఇక 2019 ఎన్నికలు వచ్చే సరికి అసలు ఏపీలో కాంగ్రెస్ ఉందనే విషయమే ప్రజలు మర్చిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో కాంగ్రెస్ ఏపీలో పుంజుకునే అవకాశమే లేదని అధిష్టానం కూడా మౌనం వహిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తెచ్చేందుకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ యాత్ర ఏపీని చేరుకుంది. కర్నూల్ జిల్లా ఆదోనిలో రాహుల్ యాత్ర సాగుతుండగా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో రాహుల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాగానే విభజన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.

అలాగే ఏపీకి ఒకే రాజధాని ఉండాలని, మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇక వైసీపీతో పొత్తుల విషయంలో స్పందించిన రాహుల్.. అది పూర్తిగా పార్టీ అధిష్టానంకు సంభందించిన విషయమని పార్టీ అధ్యక్షుడు దానిపై నిర్ణయం తీసుకుంటారాని రాహుల్ స్పష్టం చేశారు. అయితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైసీపీతో పొత్తుకు సంఘీభవం తెలిపినప్పటికి వైసీపీ అధినేత జగన్ కాంగ్రెస్ తో పొత్తుకు సై అనే అవకాశాలు చాలా తక్కువే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుత ఏపీలో కాంగ్రెస్ ఉనికే లేని పరిస్థితిలో ఉంది. ఇక కేంద్రంలో కూడా మోడీ మేనియా నే గట్టిగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తుకు జగన్ ఒప్పుకునే అవకాశమే లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ భూతుపురాణం.. అసలు వ్యూహామేంటి ?
చంద్రబాబు చాణక్యం.. పవన్ కు కలిసొస్తుందా ?
చేతులెత్తేసిన సీ.బీ.ఐ.. నెక్స్ట్ ఏంటి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -