Thursday, March 28, 2024
- Advertisement -

ఆచార్య హీరోయిన్ కాజల్ అంత సంపాదించిందా.. వామ్మో?

- Advertisement -

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీలో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించి అత్యధిక పారితోషికం పొందుతున్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది.చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే తన బాల్య స్నేహితుడు వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. అయితే కాజల్ పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందని భావించారు. అందుకు భిన్నంగా కాజల్ పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తూనే నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ నిర్వహించి అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

అందాల చందమామ కాజల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తలో ఒక సినిమాకి 23 లక్షల పారితోషకం తీసుకునేది ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు దాదాపు రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్‌ పొందుతూ సౌత్ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొంది వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కాజల్ అగర్వాల్ మొత్తం ఆస్తి విలువ దాదాపు 85 కోట్ల రూపాయలు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Also read:నటి బాబీ లహరీ కష్టాలు తెలిస్తే షాక్ అవుతారు?

ప్రస్తుతం టాలీవుడ్లో కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య మూవీలో చిరంజీవికి జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే కమల్‌ హాసన్‌ భారీ అంచనాలతో నిర్మిస్తున్న ఇండియన్‌-2 సినిమాలో నటిస్తోంది.వీటితో పాటు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ భిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. తాజాగా బాలీవుడ్లో అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఖైదీ’ సినిమా రీమేక్‌లో కాజల్ అగర్వాల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

Also read:బాలీవుడ్ లో నాంది.. హీరో అతడే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -