బాలీవుడ్ లో నాంది.. హీరో అతడే?

తాజాగా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కి థియేటర్ వద్ద కాసుల వర్షం కురిపించిన “నాంది”ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్ డేట్ తెలియజేస్తూ హీరో అజయ్ దేవ్ గన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సందర్భంగా అజయ్ ట్వీట్ చేస్తూ…

ఎంతో ముఖ్యమైన కథను పంచుకోవాల్సిన సమయం ఇది. అజయ్ దేవగన్ ఫిలిమ్స్, దిల్ రాజు ప్రొడక్షన్ లో సక్సెస్ ఫుల్ విజయాన్ని అందుకున్న “నాంది” సినిమాను రీమేక్ చేయడానికి అన్ని పనులు పూర్తి అయ్యాయని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను అంటూ అజయ్ దేవగన్ ట్వీట్ చేశారు.

Also read:కియారా అద్వానీకి ట్రిపుల్ ధమాకా..?

హిందీ రీమేక్ సినిమాలో నటీనటులు ఎవరు?ఎవరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.కథ విషయానికి వస్తే తన తప్పు ఏమాత్రం లేకుండా మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి జైలు పాలైతే న్యాయం కోసం పోరాటమే ఈ సినిమా కథ.తెలుగులో ఈ సినిమాలో అల్లరి నరేష్ నటించి చాలా సంవత్సరాల తర్వాత అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:నచ్చితే ఎలాంటి పాత్రకైనా సిద్ధం అంటున్న నటుడు?

Related Articles

Most Populer

Recent Posts