Friday, April 26, 2024
- Advertisement -

సరికొత్త పాత్రలో సాయి పల్లవి స్పెషల్ వీడియో..?

- Advertisement -

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ గా నిలుస్తూ సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే యువ దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ సాయి పల్లవిలో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఇక వివరాల్లోకి వెళితే యువ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో సాయి పల్లవి, నాని జంటగా “శ్యామ్ సింగరాయ్‌” సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సాయి పల్లవి ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. దర్శకుడు ఈ పాత్ర కోసం ఎంతోమందిని పరిశీలించి సాయి పల్లవిని ఓకే చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో సాయి పల్లవి కూడా నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

Also read:ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ అర్జీవి లాజిక్స్..?

ప్రస్తుతం “శ్యామ్ సింగరాయ్‌”మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా నటించిన “లవ్ స్టోరీ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “విరాటపర్వం” ఈ సినిమాలో కూడా సాయి పల్లవి వైవిధ్యమైన గ్రామీణ యువతి పాత్రలో నటిస్తోంది.

Also read:కియారా అద్వానీపై టాలీవుడ్ హీరోల ఫోకస్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -