కాజల్ అగర్వాల్ తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న రోజు నుంచి ఎంతో సంతోషపడిపోతుంది. తను ఎంతో ఆనందంగా ఉన్నానని తన ఫొటోలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. పెళ్లి తర్వాత జీవితాన్ని సరికొత్త కోణంలో కనిపిస్తుందని తన మనసులోని మాటను అందరితో పంచుకుంటుంది.
తన భర్త గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది. అందులో భాగంగా ఈ మధ్య మాట్లాడుతూ.. వృత్తిపరంగా బిజీగా ఉన్నా.. షూటింగ్ ముగించుకుని ఇంటికి రాగానే ఒక నందనవనంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుందని ఎంతో సంబురపడిపోతుంది ఈ చిన్నది. వ్యక్తిగత, వృత్తిపరమైన అన్ని విషయాల్లో తనను అర్థం చేసుకునే భర్త దొరికాడని చెబుతోందిన.
ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంటుంది. నేను షూటింగ్స్‌లో బిజీగా ఉంటున్నా. నా భర్త గౌతమ్ కూడా వ్యాపార వ్యవహారాలతో బిజీడా ఉంటాడు అని కాజల్ అంటోంది. ఇంత బిజీగా ఉన్నా కూడా మా ఇద్దరికి సమయం దొరకడం లేదన్న బాధే ఉండదని చెబుతోంది. పనులు ముగించుకున్నాక ఇంట్లో సంతోషంగా గడుపుతామని అంటోంది. భవిష్యత్తుపై మాకున్న కలల గురించి మాట్లాడుకుంటామని చెబుతోంది. ఇలాగే లైఫ్ లాంగ్ ఉంటామని చెబుతోంది.
ప్రియా ప్రకాష్ వారియర్ తో నితిన్ రోమాన్స్ !
ప్రభావవంతమైన భారతీయుల్లో టాప్ లేపిన అల్లు అర్జున్
విభిన్న కథాంశంతో రాబోతున్న శ్రియ!
డయాబెసిట్ ముందస్తు లక్షణాలు ఇవిగో ..!