Thursday, May 8, 2025
- Advertisement -

పోలిస్ డ్రస్ లో కాజల్.. అంత సెక్సీగానా..!

- Advertisement -

‘జిల్లా’ పేరుతో తెలుగులోకి డబ్ అవుతున్న విజయ్ సినిమాకు ఆ హీరో కన్నా.. హీరోయినే పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది. తెలుగులో విజయ్ కు అంత క్రేజ్ లేకపోవడం.. సరైన గుర్తింపు కూడా లేకపోవడంతో.. ఈ సినిమాకు కాజలే ప్లస్ పాయింట్ అవుతోంది.

ఆమె మీదనే ఈ సినిమా మార్కెట్ కావాల్సి ఉంది. ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా నటిస్తున్నాడు.. ఆయినా కూడా డబ్బింగ్ వెర్షన్ నిర్మాతలు.. తమ సినిమాకు కాజల్ ప్రధాన ఆకర్షణ అని ప్రచారంచేసుకొంటున్నారు.

ఈ సినిమాలో కాజల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తుందట. అయితే అలాగని ఆమెది సీరియస్ పాత్ర కాదని నిర్మాతలు చెబుతున్నారు. ఆమె ఒక గ్లామరస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తుందని వివరిస్తున్నారు. పోలీస్ డ్రస్ లో ఆమె లుక్స్ ఆకట్టుకొనేలా ఉంటాయని వారు వివరిస్తున్నారు. ఆ పాత్రలో కాజల్ ఎంత సెక్సీగా కనిపిస్తుందో చెప్పి సినిమాను మార్కెట్ చేసుకొనే యత్నంలో ఉన్నట్టున్నారు నిర్మాతలు.

ఈ సినిమాను మొదట రీమేక్ చేయాలని అనుకొన్నారు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో పెద్ద హీరోలే రీమేక్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే చివరకు అది జరగలేదు. తమిళ వెర్షన్ నే డబ్ చేస్తున్నారు. తెలుగు కోసం కొన్ని కామెడీ సీన్లను చిత్రీకరించి వాటిని సినిమాకు అతికించనున్నారట. మరి మొత్తంగా ‘జిల్లా’ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి! 

Gallery : Kajal spicy pics till date

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -