Friday, April 19, 2024
- Advertisement -

కమల్​ను ఇండియన్​ -2 శనిలా వెంటాడుతోంది? మధ్యేమార్గంగా ప్లాన్​చేసిన కమల్​..!

- Advertisement -

ఎవరైనా భారీ బడ్జెట్​ సినిమా తెరకెక్కిస్తుంటే సంతోషిస్తారు. ఎందుకంటే పేరుకు పేరు డబ్బుకు డబ్బు వస్తాయి. ప్రస్తుతం భారీ బడ్జెట్​ సినిమాలంటే పాన్​ ఇండియా మూవీలే.. సో దేశ వ్యాప్తంగా వాళ్ల పేరు మారుమోగిపోతుంది. అటువంటి ఆఫర్లు మళ్లీ వస్తాయి. ఇక కమల్​ హాసన్​ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాల్లో ఆయనకు ఫ్యాన్స్​ ఉన్నారు. ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయడం కమల్​ స్టయిల్​. కమల్ హాసన్​ రొటిన్​ ఫార్ములాలు, కమర్షియల్​ సినిమాలు కాకుండా విభిన్న కథాంశాలను ఎక్కువగా ఇష్టపడుతుంటాడన్న విషయం తెలిసిందే.

కమల్ హాసన్​.. శంకర్​ కాంబినేషన్​లో ఇండియన్​- 2 సినిమా మొదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ లైకా నిర్మిస్తోంది. ఇండియన్​ ఆ రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఎంతో హిట్​ అయ్యింది. దీంతో ఇన్నేళ్లకు ఇండియన్​ -2ను ప్లాన్​ చేశారు. కానీ ఈ సినిమాను ఏ ముహుర్తాన మొదలు పెట్టారో కానీ.. ఆరంభం నుంచి ఆటంకాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం నిర్మాతలు, దర్శకుడు శంకర్​ మధ్య వివాదం నెలకొని చిత్ర షూటింగ్​ ఆగిపోయింది. దీంతో కమల్​ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.

Also Read: స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..

ఈ సినిమాను వదిలేసి మరో ప్రాజెక్టు ఒప్పుకుందామంటే.. సడెన్​గా వివాదాలు తలెత్తాయి. అయినప్పటికీ ఓ సినిమాను ఒప్పుకున్నాడు కమల్​. ‘విక్రమ్’ అనే మరోసినిమా తెరకెక్కించాల్సి ఉంది. అయితే ఇండియన్​-2 లాగే ఇది కూడా భారీ ప్రాజెక్ట్.. ఒకవేళ విక్రమ్​ ప్రారంభించాక.. మళ్లీ ఇండియన్​- 2కు లైన్​ క్లియర్​ అయితే.. ఈ ప్రాజెక్టును ఆపాల్సి వస్తుంది. డేట్స్​ కుదరవు. దీంతో ఇండియన్​ -2 విషయం ఏమిటో తేలాకే .. ఈ సినిమా గురించి ఆలోచించాలని కమల్ నిర్ణయించుకున్నాడు.

అయితే ఈ గ్యాప్​లో దృశ్యం-2 రీమేక్​ లో నటించాలని కమల్ భావిస్తున్నారట. మలయాళంలో జీతూ జోసెఫ్​ డైరెక్షన్​లో వచ్చిన దృశ్యం సూపర్​ హిట్​ అయ్యింది. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్​ చేస్తే.. హిట్​ అయ్యింది. అయితే జోసెఫ్​ మలయాలంలో దృశ్యం-2ను తెరకెక్కించి హిట్​ కొట్టాడు. తమిళంలో కూడా ఈ మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాడట. కమల్​కు కూడా గ్యాప్​ రావడంతో జీతూ జోసెఫ్​ తొందరగా షూటింగ్​ పూర్తి చేస్తాడు కాబట్టి.. ఈ మూవీలో నటించేందుకు అంగీకరించాడట.

Also Read: కమల్​తో గౌతమి జత కడుతుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -