- Advertisement -

ఆ ముసలోడితో పెళ్లి ఏంటి పాప అంటూ నెటిజెన్ ప్రశ్న.. అప్పుడు ఆమె చెప్పిందంటే?

- Advertisement -

మన భారతదేశంలో ప్రేమ పెళ్ళికి వయసు ఎంతో ముఖ్యమని ఒకప్పుడు భావించేవారు. కానీ ప్రస్తుతం మాత్రం ప్రేమకు మనసులు కలిస్తే చాలు.. వయసు అడ్డు రాదని అంటున్నారు.ఇప్పటికే ఎంతో వయసు ఉన్నవారు వారి కన్నా వయసు తక్కువగా ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి జంటలలో ఒకటే మిలింద్‌ సోమన్‌-అంకిత కొన్వర్‌. తనకన్నా వయసులో 26 సంవత్సరాలు చిన్నదైన అంకితని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు.

52 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ ఎంతో ఫిట్ గా ఉండే మిలింద్ ను అంకిత పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం గురించి ఓ నెటిజెన్ వృద్ధుడిని పెళ్లి చేసుకోకూడదు అన్న భారతీయుల మూస ఆలోచనా ధోరణిని ఎలా ఎదుర్కొన్నారని అంకితను సూటిగా ప్రశ్నించాడు. ఇందుకు సమాధానంగా అంకిత చెబుతూ ఈ విధంగా ఆలోచించే వారు కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతిచోటా ఉన్నారు. కానీ మనలో దాగి ఉన్న నైపుణ్యాలు ఏది మంచి ఏది చెడు అని వీటి మధ్య వ్యత్యాసం తెలుసుకోగలిగి సృహ లేదు. నేనెప్పుడూ నాకు సంతోషాన్ని ఇచ్చే పనులను మాత్రమే చేస్తానని సమాధానం తెలియజేశారు.

Also read:భర్తతో విడిపోయిన విడాకులివ్వలేదు.. ఎందుకంటే?

ఈ క్రమంలోనే అంకిత మిలింద్ ను పెళ్లి చేసుకోక ముందు తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే వాడని అయితే అతను అకాల మరణం పొందటం వల్ల ఎంతో కుమిలిపోయిన అంకిత ఉద్యోగరీత్యా చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోటల్లో బస చేశారు. అదే హోటల్లో మిలింద్ ను చూసి తన స్నేహితుల ఒత్తిడివల్ల అతనితో కలిసి డాన్స్ చేశారు. తరువాత తన జీవితంలో జరిగిన సంఘటనలు అన్నింటిని తనతో పంచుకోగా ఇకపై తన భారాన్ని మిలింద్ తీసుకుంటున్నట్లు తెలపడంతో 2018 సంవత్సరంలో వీరిద్దరు వివాహ బంధం ద్వారా ఒకటైనట్లు తెలిపారు. ఈ విధంగా 52 సంవత్సరాల వయసున్న మిలింద్ 26 సంవత్సరాల వయసున్న అంకితను పెళ్లి చేసుకుని పెళ్లికి మనసులు కలిస్తే చాలని నిరూపించారు.

Also read:రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -