Thursday, May 9, 2024
- Advertisement -

ఆనందయ్య ‘కె’ మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

- Advertisement -

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా రోగుల కోసం తయారు చేసిన కంటి చుక్కల మందును హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య ఇచ్చే ‘కె’ రకం మందును వెంటనే బాధితులకు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అటు, కంట్లో వేసే చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక అందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గతంలో ఆనందయ్య ‘కె’ మందును రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.

కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయంటూ గతంలో ఏపీ ప్రభుత్వం కె మందుకు అనుమతిని ఇవ్వలేదు. ఈ మందును కమిటీ ముందు చూపించలేదన్న కారణంతో ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇదిలా ఉంటే.. ఆనందయ్య తయారుచేసే పి, ఎల్, ఎఫ్‌ మందులకు మాత్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ అంశంపై సోమవారం వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఆనందయ్య కె మందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కరోనా రోగులకు ఆ మందును పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా ‘కె’ మందు పంపిణీకి ఎలాంటి అభ్యంతరాల్లేవని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

ఏపీలో 20 వరకు కర్ఫ్యూ పొడగింపు!

ఒక్క మామిడి పండు ధర రూ. 1000 .. అంత స్పెషల్​ ఏమిటీ అంటారా?

మాస్కు పెట్టుకుంటే ఫైన్​.. ఇదెక్కడి విడ్దూరం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -