నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం ‘జై సంహా’ నేడు భారీ ఎత్తున విడుదలైంది. అజ్ణాతవాసిపై మిశ్రమటాక్ రావడంతో జైసింహ మూవీ హిట్ టాక్ వస్తాదనుకున్నారు ప్రేక్షకులు. ఇది కూడా ప్లాప్‌లోకి వెల్లింది. ఈ సినిమాపై ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ మూడు ముక్కల్లో సింపుల్ రివ్యూ ఇచ్చారు.
1980ల నాటి కథకి 1990ల నాటి కథనం ఈ సినిమా అని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సినిమా కథకు గతి లేదని, గమనం లేని కథనంతో కొనసాగిందని చెప్పారు. మొత్తమ్మీద ఈ సినిమా ఒక కలగూరగంప అని విమర్శించారు. నిరర్థకమైన కథలో అసంబద్ధమైన పాత్రలో బాలయ్య కనిపించారని చెప్పారు. ముగ్గురు హీరోయిన్లు ఎందుకు ఉన్నారో కూడా తెలియదని చెప్పారు. మరో సంక్రాంతి సినిమా ‘అజ్ఞాతం’లోకి వెళ్లిపోయిందని ట్వీట్ చేశారు.
కథలో బాలయ్య ఉంటారే తప్ప, బాలయ్య వల్ల కథ నడవదని మహేష్ చెప్పారు. బాలయ్యకు తగ్గ హీరోయిజం, బలం ఆ పాత్రలో లేవని అన్నారు. ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయని చెప్పారు. ముగ్గురు హీరోయిన్లలో నయనతార పాత్ర కొంచెం బాగానే ఉన్నప్పటికీ, మిగిలిన వారికి అంత స్కోప్ లేదని తెలిపారు.
బ్రహ్మానందంలాంటి కమెడియన్లు ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ లో కామెడీ పండలేదని, సెంకండ్ హాఫ్ లో కామెడీనే లేదని చెప్పారు. భట్ సంగీతం రెండు పాటల్లో మాత్రమే బాగుందని అన్నారు. కథ, కథనం బాగోలేకపోవడంతో కేయస్ రవికుమార్ దర్శకత్వ ప్రతిభ మరుగున పడిపోయిందని చెప్పారు. ఈ రివ్యూపై బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
80ల కథకి, 90ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగురగంప సినిమా “జై సింహ”. నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!
— Kathi Mahesh (@kathimahesh) January 12, 2018