Monday, April 29, 2024
- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ డేంజర్.. జాగ్రత్తగా ఉండండి : సీఎం జగన్

- Advertisement -

ఏపీ సీఎం జగన్ ఇవాళ వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష నిర్వహించారు.  మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ‘ఆస్పత్రుల్లో నాడు-నేడు’పై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, బ్రిటన్‌ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలను విధించారని.. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇప్పుడున్న సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న సౌకర్యాలను అధికారులు సీఎంకు వివరించారు. వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ప్రస్తుతం ఉన్న సదుపాయాలపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో ఉన్న సదుపాయాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్లు, అవి పనిచేస్తున్న తీరుపై బ్రిటన్‌ లాంటి దేశాల్లో పరిణామాలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. 

ప్రజల ఆరోగ్య విషయం లో తగు సూచనలు సలహాలు ఇవ్వడానికి వారిలో చైతన్యం నింపడానికి ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్‌ను నిల్వచేసే స్థాయికి వెళ్లేలా ప్రయత్నాలు, ఆలోచనలు చేయాలని సీఎం సూచించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -