Friday, March 29, 2024
- Advertisement -

వకీల్ సాబ్ రివ్యూ

- Advertisement -

నటీనటులు : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శృతిహాస‌న్‌, ప్ర‌కాశ్ రాజ్‌, నివేదాథామ‌స్‌, అంజలి, అన‌న్య నాగ‌ళ్ల
దర్శకత్వం : శ్రీరామ్ వేణు‌
నిర్మాత‌లు : దిల్‌రాజు, శిరీష్‌
సంగీతం : ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ : పి.ఎస్‌.వినోద్
ఎడిటింగ్ : ప్ర‌వీణ్ పూడి
విడుదల తేదీ : ఏప్రిల్ 09, 2021

పవన్‌ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరవబోతున్న సినిమా వకీల్‌సాబ్‌ వచ్చేశాడు. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన ‘పింక్’ రిమెక్ గా తెలుగు నేటివిటీకి తగ్గట్టు వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’ తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలోనూ ఈ రోజు మార్నింగ్‌ నాలుగు గంటల నుంచే బెనిఫిట్‌ షోస్‌ పడ్డాయి. యూఎస్‌, ఇతర కంట్రీస్‌లో సినిమా 250కిపైగా స్క్రీన్ల్‌లో ప్రదర్శితమౌతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ తర్వాత చేసిన సినిమా ఇదే. అందుకే అభిమానుల్లో ఇంత క్రేజ్, ఈ స్థాయి హైప్ క్రియేట్ అవుతుంది. ఇక వకీల్ సాబ్ మూవీ రివ్యూ మీ కోసం…

కథ :
జరీనా (అంజలి) పల్లవి (నివేదా థామస్) అనన్య (అనన్య) మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన స్నేహితులు. ఈ ముగ్గురు హైదరాబాద్ లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా గడుపుతుంటారు. ఒకరోజు పార్టీ నుంచి వస్తూ క్యాబ్ లో వెళ్తూ అనుకోకుండా వంశీ (విల‌న్) గ్యాంక్ కి చిక్కుకుంటారు.. వారితో రిసార్ట్ కి వెళ్తారు. అనూహ్యంగా అక్కడ జరిగిన గొడవ వల్ల వంశీ కోపానికి గురి అవుతారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు అవుతుంది. దాంతో దిక్కుతోచని స్థితిలో ముగ్గురు స్నేహితులు కష్టాలు పడుతుంటారు. ఏ దిక్కూ లేని ఈ అమ్మాయిల పక్షాన‌ నిలుస్తాడు వ‌కీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్). వకీల్ సాబ్ ఈ అమ్మాయిలకు ఎలా న్యాయం జరిగేలా చేశాడు ? సీనియర్ లాయర్ అయిన ప్రకాశ్ రాజ్ ని ఎలా ఎదిరిస్తాడు..? తన జీవితంలో ఏం కోల్పోయాడు? ఏం జరిగింది అన్న విషయం తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :
సినిమా టేకాఫ్ అవడమే కథలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు దర్శకుడు వేణు శ్రీరామ్. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. దానికి తోడు కథ కూడా తెలిసింది కావడంతో అంత వేగంగా అనిపించదు. సినిమా మొదలైన 15 నిమిషాలకు పవన్ వస్తాడు. తాగుబోతు లాయర్ గా.. అన్యాయం జరిగితే ఎదురుతిరిగే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ముఖ్యంగా కోర్టులో జరిగిన కొన్ని నాటకీయ అంశాలనూ, సమాజంలో స్త్రీల పై కొన్ని సందర్భాల్లో జరుగుతున్న వాస్తవిక పరిస్థితులను వేణు చాలా ఆసక్తికరంగా చూపించాడు. దర్శకుడు వేణు శ్రీ రామ్ కంటెంట్ బేస్డ్ స్టోరీలో హీరోయిజమ్ పెట్టి సినిమా స్థాయిని పెంచాడు.

నటీనటులు : వకీల్ సాబ్ మూవీ మొత్తం పవన్ భుజాలపై వేసుకున్నారు. లాయర్ వకీల్ సాబ్ పాత్రలో పవన్ పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి కోర్టు సన్నివేశాల్లో ప్రధానమైన కొన్ని హావభావాలను థియేటర్లో ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా చేశాయి. శృతిహాసన్ చనిపోయిన సీన్ లో అలాగే కోర్టులో ఎమోషనల్ గా సాగే కన్నీళ్ళు పెట్టే సన్నివేశంలో పవన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణ. క్రిమిన‌ల్ లాయ‌ర్ గా ప్ర‌కాష్ రాజ్ ఎప్పటిలాగే తన పాత్రలో చెల‌రేగిపోయారు. అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య తమ పాత్రల్లో అద్భుతంగా న‌టించారు.

సాంకేతిక విభాగం :
థమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ మూవీని తెరకెక్కించడంలో సఫలం అయ్యారు. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.

ప్లస్ పాయింట్లు : పవన్ కళ్యాన్, కోర్టు సీన్లు, సంగీతం
మైనస్ పాయింట్లు : ఫస్టాఫ్ స్లో నేరేషన్, క్లయిమాక్స్

రేటింగ్ :  3.5/5

బాటమ్ లైన్ : వకీల్ సాబ్.. సూపర్ సాబ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -