Friday, May 3, 2024
- Advertisement -

రాజధాని దుమారం…రంగంలోకి జగన్..

- Advertisement -

మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజధానిపై రగడ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ సహా ప్రతిపక్షాలన్నీ జగన్ ను టార్గెట్‌గా విరుచుకుపడుతున్నాయి. రాజధాని మార్పుపై జగన్ తన వైఖరిని ప్రకటించాలని ప్రతిపక్ష పార్టీనేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఒకడుగు ముందుకేసి పేయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై విషప్రచారం చేయడం మొదలు పెట్టారు. రెండు రోజుల్లో వీటన్నింటికి జగన్ చెక్ పెట్టనున్నారనె వార్త రాజధానిలో వినిపిస్తోంది.

ఇప్పటికే రాజధానిపై జగన్ ఒక క్లారిటీతో ఉన్నారు. రాజధానిగా అమరావతి మార్పుపై కేంద్రహోమంత్రి అమిత్ షాను కలసి అన్ని వివరాలు వివరించారు. ఎల్లుండి రాజధానికి సంబంధించిన సీఆర్డీయే(కేపిటల్ రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ) అధికారులతో ఆయన సమావేశం కాబోతున్నారు.

రాజధాని అమరావతిపై ఏపీలో గందరగోళం నెలకొన్న ప్రస్తుతం తరుణంలో సీఎం జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ నిర్ణయం కోసం ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఒక వేల జగన్ ఆలస్యం చేస్తె మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పనిలో పనిగా జగన్ ను టార్గెట్ చేయడానికి టీడీపీ,జనసేన ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తుండటం… రాజధాని ప్రాంతంలోని రైతులు ఆందోళను తీవ్రతరం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో… దీనిపై ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

నిన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం జగన్… రాజధాని అంశంపై కూడా ఆయనతో చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం సూచనలు, సలహాలు తీసుకున్న జగన్… రాజధానిపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. రాజధానిపై ఇప్పటికే జగన్ ఒక క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధి అంతా ఒకే చోటు ఉంటె రాష్ట్రంలో ఇతర ప్రాంతాలనుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

రాజధాని అమరావతిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా ? అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారా ? లేక యథాతథాస్థితిని కొనసాగిస్తారా అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు, మేధావలు, రాజకీయ పీర్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -