Friday, April 26, 2024
- Advertisement -

కేజీఎఫ్‌-2 నుంచి కొత్త అప్‌డేట్

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న కేజీఎఫ్ 2 నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 27న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. 2018లో కన్నడ స్టార్​ హీరో యశ్​ ప్రధాన పాత్రలో నటించిన ‘కేజీఎఫ్’ తొలి భాగం దేశవ్యాప్తంగా విడుదలై, అన్ని భాషల ప్రేక్షకుల్ని మెప్పించింది.

కేజీఎఫ్​ పార్ట్​ 2ను ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తొలి భాగంలో మిగిలిన అనేక ప్రశ్నలకు ‘కేజీఎఫ్ 2’ సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ.. ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు?

గరుడ వేసిన ప్లాన్‌ ప్రకారం చనిపోయిన అధీరా ఎలా తిరిగొచ్చాడు? భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్‌ ఖలీ ఏం చేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మనసులో మాట బయటపెట్టిన సామ్

ఆ హీరోను ఒంట‌రిగా క‌ల‌వ‌నందుకు సినిమా నుంచి తీసేశారు

దీపం ఉండగానే చక్కబెట్టుకుంటున్న కన్నడ బ్యూటీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -