మనసులో మాట బయటపెట్టిన సామ్

- Advertisement -

ముంబైని ఒకప్పుడు షేక్ చేసిన మాఫియా లేడీ డాన్ కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘గంగూబాయి కతియావాడి’. గంగూబాయ్ గా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియా భట్ దుమ్మురేపిన ఈ సినిమా ఇటీవలే విడుదలై సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ‘గంగూబాయి కతియావాడి’పై సమంత సోషల్ మీడియా ద్వారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘గంగూబాయి కథియవాడి’ ఒక కళాఖండం.. అలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవు. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రతి ఒక్క డైలాగ్, ఎక్స్‌ప్రెషన్ నా మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని రాసుకొచ్చింది.

- Advertisement -

ఈ సినిమాకు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించారు. ఇక సినిమాలో అలియా నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సోఫీ చౌదరి, అనన్య పాండే, ఆదిత్య సీల్ వంటి సినీ ప్రముఖులు కూడా అలియా మ్యాజిక్ చేసిందంటూ ప్రశంసలు కురిపించారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -