Wednesday, May 29, 2024
- Advertisement -

ఖైదీ నంబర్ 150 సెన్సార్ పూర్తి!

- Advertisement -
khaidi no 150 censor completed and gets ua

బ్రూస్లీ సినిమాలో ‘జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. టైమింగ్ లో గ్యాప్ ఉండదు..’ అనే డైలాగ్ చిరు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడది నిజం చేసి చూపించారు. పదేళ్ల తర్వాత చిరు హీరోగా చేస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమా ప్రారంభానికి కాస్త టైం తీసుకుంది కానీ.. విడుదల విషయంలో ఒక్క రోజు కూడా లేటు ఆలస్యం కాకుండా చుసుకుంటున్నారు.

పక్కా ప్లాన్ తో సంక్రాంతికి రిలీజ్ చేసేలా ఈ సినిమాని కంప్లీట్ చేస్తున్నారు. మాస్ దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఖైదీ నంబర్ 150 నేడు (గురువారం) సెన్సార్ బోర్డు సభ్యుల వద్దకు వెళ్ళింది. ఎటువంటి కట్స్ లేకుండా యూఏ సర్టిఫికెట్ అందుకుని సంక్రాంతి బరిలోకి రాబోతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత రామ్ చరణ్ తేజ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సెన్సార్ పూర్తి కావడంతో.. ఇక సినిమా యూనిట్ ఇతర ప్రచార కార్యక్రమాలతో పాటు, జనవరి 4 న జరగబోయే.. ప్రీ రిలీజ్ పంక్షన్ కోసం అన్ని ఏర్పట్లు చేసుకుంటున్నారు.

Related

  1. ఖైదీ నెం.150 గురించి చిరు షాకింగ్ కామెంట్స్!
  2. సుందరితో ఖైదీ.. అదిరిపోయింది!
  3. ఖైదీనెం.150 కాపీ కొట్టి అడ్డంగా దొరికిన దేవిశ్రీ
  4. ఖైదీ నెం 150 టీజర్ అదిరింది! రికార్డులు బద్దలు కొట్టడం పక్కా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -