Saturday, May 18, 2024
- Advertisement -

సుందరితో ఖైదీ.. అదిరిపోయింది!

- Advertisement -
Kajal agarwal and Chiranjeevi Look in Khaidi no 150

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ”ఖైదీ నెం 150”. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇటివలే ”అమ్మడు లెట్స్ డు కుమ్ముడు” అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన రచ్చ విషయం తెలిసిందే.

అయితే ఈ రచ్చ కేవలం కుమ్ముడు తో ఆగిపోతే ఎలా? అందుకే ఇప్పుడు ”ఖైదీ నెం 150” సినిమా నుంచి ఇప్పుడు మరో డ్యాన్స్ నెంబర్ దించుతున్నారు. ఈసారి యురోప్ దేశాల్లో మెగాస్టార్ అండ్ సెక్సిణి కాజల్ అగర్వాల్ చేసిన రొమాన్స్ తాలూకు టేస్ట్ చూడబోతున్నాం మనం. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ”సుందరి” అనే పాటను రేపు సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా స్లొవేనియాలో తీసిన ఒక స్టిల్ తో ఒక మెగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

అబ్బో ఆ పోస్టర్ ఉంది చూస్కోండి.. మెగాస్టార్ ఎట్ రొమాంటిక్ బెస్ట్ అనే చెప్పాలి. అయితే సడన్ గా సైడ్ యాంగిల్లో నుండి చూస్తుంటే మాత్రం మెగాస్టార్ చిరంజీవి అచ్చం తనయుడు రామ్ చరణ్ తరహాలో కనిపిస్తున్నారు. ఇక చిరు అండ్ కాజల్ కెమెస్ట్రీ కూడా ఇప్పటివరకు అమ్మడు చరణ్.. బన్నీ.. పవన్ లతో చేసిన రొమాన్స్ కు ఏమాత్రం తీసిపోద్దు. మరి ఖైదీ సుందరిని ఏం చేశాడు.. సుందరి ఖైదీని ఏం చేసిందో తెలియాలంటే.. రేపటి సాయంత్రం వరకు ఆగాల్సిందే. అప్పుడే ఈ కొత్తపాట కుమ్ముడు ఏంటో తెలిసేది.

Related

  1. చిరు టార్గెట్ తెలుస్తే షాక్ అవుతారు!
  2. ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’ అంటున్న చిరు!
  3. లీకైన ‘ఖైదీ నెం.150’ మూవీ సాంగ్.. డాన్స్ తో అదరగొట్టిన చిరు, కాజల్!
  4. చిరుకు అదిరిపోయే షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -