మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా చేస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎప్పటినుంచో చిరంజీవి 150వ సినిమాకు రకరకాల టైటిల్స్ ఊహాగానాలయ్యాయి. అయితే ఈ సినిమాకి నూటికి నూరు శాతం సరిపడే “ఖైదీ నెంబర్ 150” అనే పేరును ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తెలిపారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 150వ సినిమా ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.
ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. మెగా అభిమానులు మాత్రం పండగా చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి నర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి చక్కని ట్యూన్స్ సిద్ధం చేశారు. ఈ చిత్రానికి రచన : పరుచూరి బ్రదర్స్ , కెమెరా: రత్నవేలు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ , కళ: తోట తరణి, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: వి.వి.వినాయక్
{youtube}v=_14RutcoeFQ{/youtube}
Related