Saturday, May 18, 2024
- Advertisement -

చిరు అంటే ఏంటో తెలుసుకోవాలా? ఇది చూడండి!

- Advertisement -

సినిమాల ప‌రంగా మెగాస్టార్ చిరంజీవికి ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఇప్ప‌టికీ చిరు నెంబ‌ర్ యాక్ట‌ర్ అని, డాన్స్‌లో సూప‌ర్ అని చెప్పే ఎందరో అభిమానులు ఉన్నారు. అటువంటి చిరు 150వ సినిమా ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.  టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న చిరు 150వ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని నానకరామ్ గూడలో జరుగుతోంది.

అయితే చిరు సినిమా కోసం ఎంతటి కష్టం అయిన పడుతాడు.  గ‌తంలో.. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న‌యుడు, ధ్రువ.. చెర్రీ 22న  చిరు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘‘13 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఠాగూర్’ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ చిత్రంలోని ‘కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి..’ అనే పాట అభిమానుల గుండెల్లో నాటుకుపోయింది. ఆ పాట షూట్ చేస్తున్నప్పుడు నాన్నగారు డాన్స్ చేస్తుంటే.. ఉన్నట్టుండి మొకాలినొప్పి వచ్చింది.

అయినా నాన్న ఆ విషయం బయటకు చెప్పకుండా నొప్పినంతా బిగబట్టి మామూలుగా డ్యాన్స్ చేశారు. నేను, వినాయక్ గారు ఆ విషయాన్ని గమనించాం. ఆ సమయంలో నాకు ఏడుపొచ్చేసింది. నాన్న గారు పడుతున్న కష్టం చూసి వినాయక్‌గారి కళ్లు చెమర్చాయి. సినిమా షూటింగ్ అయిపోయాక నాన్నకు మోకాలి ఆపరేషన్ జరిగింది. ఈ విషయం చాలామందికి తెలీదు.’’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు చరణ్. ఇది చిరుకు సంబంధించి ఒక్క జ్ఞాప‌క‌మే కాదు.. న‌ట‌న ప‌ట్ల ఆయ‌న‌కున్న డెడికేష‌న్‌కు మ‌చ్చుతున‌క‌. అందుకే నేటికీ చిరు స్టార్ వెలిగిపోతోంది.

Related

  1. చిరు – పవన్ ని లైట్ తీసుకున్న అల్లూ శిరీష్
  2. ఆలీ కి షాక్ ఇచ్చిన చిరు!
  3. చిరు సినిమాకి పవన్ సలహాలు చెప్పాడట!
  4. చిరు సినిమాలో హీరోయిన్ ఫిక్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -