మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఖైదీ నెం 150. దాదాపు 8 సంవత్సరాల తర్వాత చిరు పూర్తి స్థాయిలో వెండితెరపై కనపడనుండడంతో ఈ సినిమాపై అభిమానులో ఎంతో ఆసక్తిగా నెలకొంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి ఈ రోజు టీజర్ రిలీజ్ చేశారు. రేపటి నుండి చిత్ర టీజర్ ధృవ ప్రదర్శించబడే అన్ని థియేర్స్ లలో ప్రదర్శితం కానుంది.
ఇక కొన్నాళ్లుగా చిత్ర ఆడియో వేడుకకి సంబంధించి అభిమానులలో కాస్త సందిగ్ధం నెలకొనగా, దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 25న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో చిత్ర ఆడియా వేడుకని గ్రాండ్ గా జరిపాలని భావిస్తున్నారట.
దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు టాక్. ప్రస్తుతం ఖైదీ నెం 150 మూవీ టీం రెండు భాగాలుగా వీడిపోయి షూటింగ్ ని తెరకెక్కిస్తోండగా, మరో వారం రోజులో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఇక ఈ టీజర్ విషయంకు వస్తే.. చిరు లుక్ అదిరిపోయే రెంజ్ లో ఉంది. ఖచ్చితంగా అభిమానులను అలరించే రెంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని ఈ టీజర్ తో చెప్పొచ్చు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఖైదీ నెం 150 చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తోండగా, దేవి శ్రీ చక్కని బాణీలు అందిస్తున్నాడు.
{youtube}MS_yWNMixQQ{/youtube}
Related