- Advertisement -

చిరు సినిమా ఆడియోకి పవర్ స్టార్!

- Advertisement -
Pawan Kalyan Chief Guest For Chiranjeevi Khaidi No 150 Audio

మెగా ఫ్యాన్స్ కి ఇది నిజంగా గుడ్ న్యూస్. మెగా అభిమానులో జోష్ నింపడానికి మెగా బ్రదర్స్ ఒకే వేదికపైకి వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. ఈ సినిమా ఆడియో డేట్ ఫిక్సైంది. చిరు రీ ఎంట్రీ కోసం ఎదురు చూసిన అభిమానులకు పండగ స్టార్ట్ అయ్యింది.

మెగాహీరోల ఆడియో ఫంక్షన్ కు హాజరైన చిరు, చాలా కాలం తర్వాత తన సొంత సినిమా ఆడియో ఫంక్షన్ కు రాబోతున్నారు. ఈ మెగా ఈవెంట్‌ని చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశాడట నిర్మాత రాంచరణ్. డిసెంబర్ 18న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ఆడియో ఫంక్షన్ జరగబోతుంది. బాస్ ఈజ్ బ్యాక్ మూవీ కావడంతో, ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ ఈవెంట్‌ను భారీ స్థాయిలో చేయాలనుకుంటున్నారు రామ్ చరణ్ అండ్ కో. అందులోనూ రామ్ చరణ్ స్థాపించిన ఈ కొణిదెల ప్రొడక్షన్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఆడియోని గ్రాండ్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఇక ఈ వేడుకకు మెగా హీరోలందరూ హాజరౌతారని తెలుస్తుంది. ముఖ్యంగా చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వస్తారని తెలుస్తోంది. పవన్ సర్ధార్ సినిమాకి మెగాస్టార్ హాజరయ్యారు. చిరు రీ ఎంట్రీ సినిమా కావడంతో పవన్ దాదాపు రావడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ వేడుకకు అక్కినేని నాగార్జున ఛీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వేడుకపై మెగా యంగ్ హీరోలు డాన్స్ లు కూడా వెయనున్నారట. మొత్తానికి మెగా హీరోలందరిని ఒకే వేదికపై చూసే చాన్స్ మెగా అభిమానులకు రాబోతుంది.

Related

  1. చిరు ఎంట్రీ ఇస్తుంటే .. పవన్ ఎగ్జిట్ కానున్నాడా..?
  2. చిరు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుస్తే దిమ్మతిరగాల్సిందే!
  3. సుమకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పవన్!
  4. ఈ సంగతి తెలిస్తే పవన్ కు ఫ్యాన్ అయిపోవాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -