- Advertisement -

మరో కర సేవకుడు హత్య.. భగ్గుమన్న బిజేపి అర్థ రోజు బంద్..!

- Advertisement -

కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​( ఆర్ఎస్​ఎస్​) కార్యకర్తను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. మృతుడు వయలార్​కు చెందిన రాహుల్​ కృష్ణ అలియాస్ నందుగా పోలీసులు గుర్తించారు.

అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి చెర్తలకు సమీపంలోని నాగమ్​కులనగర్​లో ది సోషల్​ డెమొక్రటిక్​ పార్టీ ఆఫ్​ ఇండియా(ఎస్​డీపీఐ), ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాహుల్​ కృష్ణ అలియాస్​ నందు అనే ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త మృతి చెందాడని, ముగ్గురు ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలతో పాటు, ఆరుగురు ఎస్​డీపీఐ కార్యకర్తలు గాయపడ్డారని వెల్లడించారు.

ఇస్లామిస్ట్​​ అవుట్​ఫిట్​ పాపులర్​ ఫ్రంట్​(పీఎఫ్​ఐ)కు ఎస్​డీపీఐ అనుబంధ శాఖ. కాగా ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తను హత్య చేసింది పాపులర్​ ఫ్రంట్​ కార్యకర్తలేనని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్​ ఆరోపించారు.ఆర్ఎస్​ఎస్​ కార్యకర్త మృతికి నిరసనగా బిజేపితో పాటు హిందూ సంస్థలు అలప్పుజలో 12 గంటల పాటు బందుకు పిలుపునిచ్చాయి.

మరికొద్ది సేపటిలో అనూష మృత దేహానికి శవపరీక్ష.. అందులో ఏమని వస్తుందో..!

‘ఉప్పెన’ మూవీలో కృతి శెట్టికి ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా?

సరికొత్త ప్రయోగాత్మక మూవీగా రాబోతున్న “మడ్డీ” !

మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -