Thursday, April 25, 2024
- Advertisement -

మీరు టికెట్ ఇవ్వకపోయినా నేను గెలిచాను ఎలా అంటే..!

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ పోరాటం చేయకపోవడంతోనే దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలు బిజెపీ కి పట్టం కట్టారని మాజీ ఎమ్మెల్యే, బిజేపి నేత కూన శ్రీశైలం గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పోరాడిన ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే ఉన్నా తనకు టికెట్​ ఇవ్వకపోయినా..

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఆయన దిల్లీలో బిజేపి జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న తరువాత తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు.

కూన శ్రీశైలం గౌడ్‌ను బండి సంజయ్‌, పార్టీ శ్రేణులు సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరెవరినో తీసుకువచ్చి ఎమ్మెల్సీ చేస్తున్నాడని.. అదే తరహాలో పీవీ కూతురును కూడా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు.

టి.ఆర్.ఎస్ కి అభ్యర్థులను లేకనే పీవీ బిడ్డను బరిలో నిలిపారని ఎద్దేవా చేశారు. బిజేపి అభ్యర్థి రాంచందర్‌రావు గెలుపు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.

సంచలన ప్రకటన.. పబ్లిక్​ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం..!

మరో కర సేవకుడు హత్య.. భగ్గుమన్న బిజేపి అర్థ రోజు బంద్..!

మరికొద్ది సేపటిలో అనూష మృత దేహానికి శవపరీక్ష.. అందులో ఏమని వస్తుందో..!

‘ఉప్పెన’ మూవీలో కృతి శెట్టికి ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -