టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు వి. వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా..అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టగా,హరీష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు.
ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సత్యదేవ్ ఒక్కో మెట్టు ఎదుగుతూ హీరో స్థాయికి చేరాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో పలు సినిమాల్లో నటించాడు. ఇటీవల హీరోగా మారి వరుసగా విజయాలు అందుకున్నాడు. సత్య దేవ్ ఇటీవల నటించిన బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య, తిమ్మరుసు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా మంది హీరోలు షూటింగులకు దూరం అవగా సత్యదేవ్ మాత్రం పలు సినిమాల్లో హీరోగా నటించి ఓటీటీల్లో విడుదల చేశారు. అలాగే పలు వెబ్ సిరీస్ లలో నటించారు. బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చి ఓ హిందీ సినిమా చేస్తున్న సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లూసిఫర్ రీమేక్ లో కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
Also Read: తమ్ముడి సినిమాకు పోటీగా అన్నయ్య సినిమా విడుదల… ప్రచారంలో నిజమెంత..!