టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ అందరూ పవన్ తో ఒక్క సినిమా అయిన తీయాలి అని అనుకుంటారు. ఆ చాన్స్ వస్తే వారి క్రేజ్ ఓ రెంజ్లో పెరిగిపోతుంది. అయితే ప్రభాస్ తో మిర్చి, మహేష్ తో శ్రీమంతుడు , ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చిత్రాలు చేసి సూపర్ హిట్స్ కొట్టి టాప్ డైరెక్టర్ అయిన దర్శకుడు కొరటాల శివ. ఈ మూడు సినిమాలతో సందేశాన్ని ఇచ్చి కూడా మెప్పించిన దర్శకులు శివ.
ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో టాప్ హీరోస్ ఈ దర్శకుడితో సినిమా చేయడానికి చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రభాస్ లతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు కొరటాల శివ. అయితే పవన్ తో కూడా ఓ భారీ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు కొరటాల శివ. ఇప్పటేకే పవన్ దృష్టిలో పెట్టుకొని కథలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పవన్ తో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. కాబట్టి ఆ అంచనాలకు తగ్గట్లుగా మానవీయ కోణంలో బ్రహ్మాండమైన కథ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే అది ఏ రెంజ్ లో హిట్ అవుతోంది ప్రత్యేకంగా చెప్పకర్లేదు.
Related