Wednesday, May 15, 2024
- Advertisement -

ఎవిడెన్స్‌తో అడ్డంగా దొరికిన పవర్ స్టార్!

- Advertisement -

 

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎవిడెన్స్‌తో అడ్డంగా దొరికిపోయాడు. పవర్ స్టార్ అడ్డంగా దొరకడం ఏంటి అని షాక్ అవుతున్నారా? అసలు విషయంలో కి వేళ్తే…
ప్రస్తుతం గోపాల ..గోపాల సినిమా దర్శకుడు డాలీ దర్శకత్వంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన వీర‌మ్ ఆధారంగా తెర‌కెక్కుతోంది అనే ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది. ఇదే ఇప్పుడు నిజ‌మ‌నే ప్రూఫ్ మ‌రోటి దొరికింది. తమిళంలో 2014లో తెర‌కెక్కిన వీర‌మ్ సూప‌ర్ హిట్ అయ్యింది. శివ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో 50 కోట్లు వ‌సూలు చేసింది.

ఈ చిత్రంలో అజిత్ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా న‌టించాడు. ఇప్పుడు కొత్త సినిమాలో కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గానే న‌టించ‌నున్నాడు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎక్కవ భాగం పంచెక‌ట్టుతో కనిపిస్తాడట. అజిత్ కూడా వీర‌మ్‌లో పంచెక‌ట్టుతోనే క‌నిపించాడు. ఇక ఇప్పుడు మ‌రో ప్రూఫ్ బ‌య‌టికి వ‌చ్చింది. అదే ఈ సినిమాలో ప‌వ‌న్ తో పాటు మ‌రో ముగ్గురు కుర్ర హీరోలు న‌టించ‌నున్నార‌ని. వీర‌మ్ లో అజిత్ కు త‌మ్ముళ్లుగా న‌లుగురు కుర్రాళ్లు న‌టించారు.

ఇందులో ఇద్ద‌రు త‌మిళ‌నాట గుర్తింపు ఉన్న హీరోలే. ఇప్పటి వరకు పవర్ స్టార్ నటించేది వీర‌మ్ రీమేకా అనే అనుమానాలుండేవి. కానీ ఇప్పుడు ముగ్గురు కుర్ర హీరోలు కావాల‌నే స‌రికి.. అదేన‌ని క‌న్ఫ‌ర్మ్ చేస్తున్నారు ఫిలింనగర్ జనాలు.

Related

  1. ఇండైరెక్ట్ గా సహాయం చేసిన పవర్ స్టార్!
  2. పవర్ స్టారా మజాకా!
  3. పవన్ కళ్యాణ్ కడప కింగ్ స్టోరీ!
  4. ప‌వ‌న్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సునీల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -