Thursday, May 8, 2025
- Advertisement -

‘లై’ మూవీ రివ్యూ

- Advertisement -

హను రాఘవ పూడి డైరెక్షన్ లో నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటించిన సినిమా ‘లై’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ వంటి మంచి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన హను రాఘవ పూడి ఈ సినిమా కి కూడా దర్శకత్వం వహించారు. ప్రేమ కాన్సెప్ట్ తో కాస్త డిఫరెంట్ గా తెరకెక్కించిన ‘లై’ మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
అర్జున్ ఒక సీక్రెట్ మాఫియా డాన్. రవి కిషన్ లోకల్ డాన్ గా అర్జున్ కింద పని చేస్తూ ఉంటాడు. నితిన్ కి మేఘ ఆకాష్ తో ఓ అబద్ధం తో పరిచయం ఏర్పడుతుంది. ఆ అబద్దాలతోనే ఆమె ని ప్రేమలో పడేస్తాడు నితిన్. అలా నడుస్తున్న వారి ప్రేమ కథ ఇంట్రవెల్ టైం లో కొత్త మలుపు తీసుకుంటుంది. నితిన్ కి ఒక బాగ్ దొరుకుతుంది. ఆ బాగ్ తనకి తెచ్చి ఇవ్వాలని అర్జున్ నితిన్ ని కోరుతాడు. అసలు ఆ బాగ్ లో ఏముంది, నితిన్ కి, అర్జున్ కు మధ్య వైరం ఎందుకొచ్చింది, చివరికి నితిన్, మేఘ ఆకాష్ ల ప్రేమ ఏమైంది అనేదే ఈ లై కథ.

ఎలా ఉందంటే :

లై స్టోరీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. హీరో నితిన్‌.. విలన్ అర్జున్‌ల మధ్య జరిగే.. మౌస్‌ స్టోరీ. తెలుగు సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే.. కమర్షియల్ అంశాలు ఈ మూవీలో కనిపించవు. ఫస్ట్‌ హాఫ్ ని ఎక్కడ బోర్ కొట్టకుండా.. దర్శకుడు అద్భుతంగా నడిపించాడు. బ్లాక్‌లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్‌తో సినిమా మీద మరింత ఆసక్తి పెంచాడు దర్శకుడు. ఆ తర్వాత సెకండాఫ్‌లో ఎప్పటికప్పుడు స్టోరీలో కొత్త ట్విస్ట్‌లు ఇస్తూ క్లైమాక్స్‌ వరకు కథను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బేసికల్ ‘లై’ అనేది ఓ స్క్రీన్‌ ప్లే బేస్‌డ్ మూవీ అని చెప్పాలి. అలాగే, సినిమాలో నితిన్ అర్జున్ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. ఈ మూవీలో నితిన్‌ బాగా నటించినప్పటికీ, సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్‌ మాత్రం సీనియర్ హీరో అర్జున్ అనే చెప్పాలి. ఇక హీరోయిన్ మేఘా ఆకాష్ తన పాత్రకు న్యాయం చేసింది.

ప్లస్ పాయింట్స్ :

* మణిశర్మ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌

* హను రాఘవపూడి టేకింగ్‌

* రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌

* సూపర్బ్‌ లొకేషన్స్‌

మైనస్ పాయింట్స్ :

* కమర్షియల్ హంగులు ఈ సినిమాలో కనిపించవు..
* కామెడీ మిస్ అయింది

మొత్తం గా :

మొత్తానికి నితిన్ ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అని చెప్పవచ్చు. రొడ్డకొట్టుడు కమర్షియల్ సినిమాల కాకుండా ఈ సినిమా కొత్తగా ఉంటుంది. కొత్తదనం ఉన్న సినిమాలు చూడాలనుకునేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -