దసరాకు బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి వచ్చేశాయి నందమూరి బాలృష్ణ నటించిన భగవంత్ కేసరి, ఇళయ దళపతి విజయ్ నటించిన లియో. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాయి.
ఇక భగవంత్ కేసరి సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా కాజల్, శ్రీలీల కీలక పాత్ర పోషించారు. బాలయ్య గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కడంతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో 71 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం లియో. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం యుఎస్‌లో 3.7 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు.