సీనియర్ హీరోలలో నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఆన్ స్టాపబుల్ షో ద్వారా ఎవరు ఊహించని విధంగా తన క్రేజ్ పెంచుకున్నారు బాలయ్య. ఏకంగా ఇప్పటికీ యంగ్ హీరోలను కూడా మించి పోయేంతలా యూత్ లో క్రేజ్ సంపాధించుకున్నారు. దాంతో బాలయ్య సినిమాలపై ఇప్పుడు విపరీతమైన బజ్ ఏర్పడుతోంది. గత ఏడాది డిసెంబర్ లో అఖండ మూవీ తో బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకున్న బాలయ్య.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వీరసింహరెడ్డి మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. .
ఇక ఈ మూవీ తరువాత అనిల్ రావిపూడి తో ఓ మూవీ చేస్తున్నాడు బాలయ్య. ఇదిలా ఉంచితే బాలయ్య కెరియర్ లోనే మెమోరబుల్ హిట్ గా నిలిచిన ఎవర్ గ్రీన్ మూవీ ” ఆదిత్య 369 “. టైమ్ మిషన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఇప్పటికీ కూడా ప్రేక్షకుల మదిలో మెదులుతుందంటే ఈ మూవీ చూపిన ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మూవీకి సిక్వల్ గా ” ఆదిత్య 999 ” తీయాలని బాలయ్య ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు.
మొదట తన 100వ చిత్రంగా ఈ మూవీనే తెరకెక్కించాలని బాలయ్య ప్లాన్ వేసిన్నప్పటికి ఆనవార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ కూడా ” ఆదిత్య 999 ” కచ్చితంగా ఉంటుందని గతంలో ఆయా సందర్భంలో చెప్పుకొచ్చారు. దాంతో ” ఆదిత్య 999 ” మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటసింహ నందమూరి బాలకృష్ణ. విశ్వక్ సేన్ దంమ్కి మూవీ ట్రైలర్ లంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన బాలయ్య ” ఆదిత్య 999 ” కచ్చితంగా ఉంటుందని, అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతుందని హింట్ ఇచ్చారు. దీంతో అప్పట్లోనే టైమ్ మిషన్ కన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ” ఆదిత్య 369 ” ఇప్పుడున్న టెక్నాలజీతో మరింత థ్రిల్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
స్టార్ హీరోలే విలన్లు.. ఆ డైరెక్టర్ అంతే !
