Sunday, May 11, 2025
- Advertisement -

6వ స్థానంలో నిలిచిన మ‌హ‌న‌టి

- Advertisement -

మ‌హ‌న‌టి సినిమా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.మే 9న విడుద‌లైన ఈ సినిమా క‌లెక్షన్లు కూడా అదే విధాంగా ఉన్నాయి.సావిత్రి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి పాత్ర‌ను హీరోయిన్ కీర్తి సురేష్ పొషించింది.ఈ సినిమా తెలుగు,త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల చేసిన ఈ సినిమా, రెండు భాష‌లలోను హిట్‌గా నిలిచింది.ఇప్పుడు ఈ సినిమా మ‌రో రికార్డు క్రియేట్ చేసింది.ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది మహానటి.

శుక్రవారం నాటికి ఈ సినిమా 5 కోట్ల 75 లక్షలను రాబట్టింది. ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ కు అతి చేరువలో ఉన్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ‘రంగస్థలం’,’భరత్ అనే నేను’,’అజ్ఞాతవాసి’,’భాగమతి’,’తొలిప్రేమ’ వంటి సినిమా తరువాత స్థానాన్ని దక్కించుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -