Sunday, June 16, 2024
- Advertisement -

‘మహానటి’మ‌రో రికార్డు!

- Advertisement -

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటించారు.విడుద‌లైన‌ రోజు నుండే సినిమా సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.ఇప్ప‌టికే అనేక రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది.ఈ సినిమా యూఎస్ మార్కెట్‌లో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిత్రం బృందం సినిమా పోస్ట‌ర్‌లో వెల్ల‌డించింది.మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి ఓవర్‌ సీస్‌లో రికార్డు దిశ‌గా న‌డుస్తుంది.ఇప్పటికీ హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్న మహానటి ముందు ముందు మరిన్ని రికార్డులు సాధించటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొం‍డ, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -