Thursday, May 16, 2024
- Advertisement -

మహేష్ బాబుపై సంచలన కామెంట్స్ చేసిన ఎన్టీఆర్

- Advertisement -
Mahesh Most Handsome Guy In Tollywood

టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో మరో స్టార్ హీరోని పోగడడం చాలా అరుదు. ఎందుకంటే ఇగో అడ్డొచ్చి చాలామంది ఆగిపోతారు. కానీ ఇగో పక్కన బెట్టి పొగిడితే అది హుందాగా ఉంటుంది. దాంతో ఆ హీరోకి మంచి పేరు వస్తోంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇలానే ఆలోచిస్తున్నాడు.

టాలీవుడ్లోని ఇద్దరు హీరోల మీద ప్రశంసలు కురిపించాడు తారక్. టాలీవుడ్లో అత్యంత అందగాడు మహేష్ బాబేనని ఎన్టీఆర్ కితాబివ్వడం విశేషం. ఈ విషయంలో ఇంకో మాట లేదని కూడా అన్నారు ఎన్టీఆర్. ఇక అంతేకాకుండా నటుడిగా నాని అంటే ఇష్టమని ఎన్టీఆర్ తెలిపాడు. ఇక వాయిస్ పరంగా అంటే.. రానా దగ్గుబాటి అంటే ఇష్టమంటూ తనను ఇంటర్వ్యూ చేస్తున్న రానాను పడేశాడు తారక్.

ఐఫా వేడుకలో ‘జనతా గ్యారేజ్’ మూవీకి గాను ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ప్రసంగం కూడా అందరి మనసుల్ని గెలుచుకుంది. తనతో పాటు ఇక్కడ నామినేషన్ అందుకున్న ప్రతి హీరోకూ ఈ అవార్డు దక్కుతుందని ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు. కెరీర్ మొదట్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్.. అప్పట్లో కొంచెం పొగరుగా కనిపించేవాడు. వయసుకు మించి మాట్లాడేవాడు. కానీ వయసు పెరిగే కొద్ది అతడిలో మెచ్యూరిటీ వచ్చింది. అందుకు తాజాగా వ్యాఖ్యలే నిదర్శనం.

{youtube}459VRbwpa7Y{/youtube}

Related

  1. పవన్ ఫ్యాన్స్ పై మహేష్ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకున్నారు..?
  2. మహేష్ మూవీ షూటింగ్ స్పాట్ కి వెళ్లిన మెగాస్టార్!
  3. మహేష్ భార్య రీ ఎంట్రీ.. ఏ సినిమాలో అంటే..?
  4. మహేష్ సినిమా పై రకుల్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -