Saturday, April 27, 2024
- Advertisement -

పవన్ ఫ్యాన్స్ పై మహేష్ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకున్నారు..?

- Advertisement -
Pawan Kalyan Fans, Mahesh Babu Fans, NTR Fans, Katamarayudu

తెలుగులో చిరు తర్వాత ఆ స్థానంలో ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇద్దరు నెంబర్ వన్ స్థానంకు పోటీదారులు కావడంతో.. వాళ్ల ఫ్యాన్స్ మధ్య శతృత్వం ఆటోమేటిగ్గా ఉంటుంది. ఈ శతృత్వం ఓ మోస్తరు స్థాయిలో మొదలై.. ఈ మధ్య తీవ్ర రూపం దాలుస్తోంది. తమ హీరో మూవీ సక్సెస్ అయినప్పుడు.. అవతలి హీరో ఫ్యాన్స్ ని ఎద్దేవా చేయడం.. అవతలి హీరో సినిమా ప్లాప్ అయినప్పుడు ఎటకారాలు చేయడం ఈ మధ్య మామూలు అయిపోయింది.

పోయినేడాది పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల సినిమాలు నెల వ్యవధిలో వచ్చాయి. ముందుగా సర్దార్ సినిమా వచ్చి.. ప్లాప్ అయ్యింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోయి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవం మూవీ వచ్చింది. అది సర్దార్ కన్న పెద్ద ప్లాప్ అయ్యింది. ఇక పవన్ అభిమానులు రివెంజ్ ఓ రెంజ్ లో తీర్చుకున్నారు. అంతకుముందు మహేష్ ఫ్యాన్స్ చేదిందాంట్లో పోలిస్తే చాలా ఎక్కువే చేశారు పవన్ అభిమానులు. ‘ఫ్లాపోత్సవం’ ‘డిజాస్టర్ స్టార్ మహేష్ బాబు’ అని ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఓ రేంజిలో ట్రోల్ చేశారు.

మహేష్ డ్యాన్సుల మీద ఎటకారాలాడారు. అప్పట్నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న మహేష్ అభిమానులకు.. ‘కాటమరాయుడు’ ఛాన్సిచ్చాడు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిన.. డివైడ్ టాక్ వచ్చిందని మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ‘రాయుడు రీచ్ అస్సాం’ పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోలింగ్ ఓ రేంజిలో చేస్తున్నారు. చిత్రం గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ.. పవన్ డాన్స్ ల గురించి ఎటకారాలు ఆడుతూ పవన్ ఫ్యాన్స్ ని ఉడికించే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తోడై పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తుండటం విశేషం. పోయినేడాది ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ టైంలో ఆ సినిమాకు కొంచెం డివైడ్ టాక్ రాగానే పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అందుకే వాళ్లు కూడా రివెంజ్ తీర్చుకుంటున్నారు. 

{youtube}crGtUsBFXSQ{/youtube}

Related

  1. పవన్ ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలుసా..?
  2. పవన్ పై సంచలన కామెంట్ చేసిన రామ్ చరణ్
  3. పవన్ బరిలోకి దిగితే ఎవరికి లాభం..?
  4. పవన్ పద్ధతి పై జగన్ సంచలన వ్యాఖ్యలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -