Saturday, April 27, 2024
- Advertisement -

సమకాలిన స్టార్ హీరోల సమరం..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటులు. కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య నెంబర్ వన్ చైర్ కోసం పోటాపోటీ సమరం జరుగుతోంది. ఇద్దరిలో ఎవరూ ఎక్కువ కాదు..ఎవరూ తక్కువ కాదు. ఇద్దరికీ టాలీవుడ్ రికార్డులను తిరగ రాసే ఫ్యాన్ బేస్ ఉంది. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పరిచయం అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్లారు. తన నాలుగో చిత్రం తొలిప్రేమ తోనే యువత హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

ఇక మహేష్ బాబు 1999లో హీరోగా నటించిన మొదటి సినిమా రాజకుమారుడు తోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత 2001లో వచ్చిన మురారి, 2003లో విడుదలైన ఒక్కడుతో సూపర్ హిట్లు సాధించి స్టార్డం సంపాదించాడు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య పోటీ మొదలైంది. అయితే ఈ ఇద్దరు హీరోలు మొదటి నుంచి ఏడాదికొక సినిమాలో మాత్రమే నటిస్తూ వస్తున్నారు. పవన్ ఇప్పటి దాకా 26 సినిమాల్లో నటించగా , మహేష్ కూడా 26 సినిమాలే చేశాడు. అయితే వీరిద్దరూ ఇప్పుడు వరుస బెట్టి సినిమాలు చేస్తున్నారు. కెరీర్లో ఎన్నడూ లేనివిధంగా ఈ హీరోల సినిమాలు వరుసగా విడుదలకానున్నాయి.

Also Read: ఆ పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..

కరోనా కారణంగా వీరు నటిస్తున్న సినిమాలు ప్రస్తుతం ఆగిపోగా వచ్చే ఏడాది ఆరంభం నుంచి వరుసగా విడుదల అవనున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు, సాగర్ దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో నటిస్తున్నారు. మరో వైపు ఆగస్టు నుంచి హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు పవన్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఈ సినిమాలు పూర్తయిన తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయనున్నాడు.

మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తాడు. ఆర్ఆర్ఆర్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత రాజమౌళి -మహేష్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉన్న విషయం తెలిసిందే. ఇలా పవన్, మహేష్ వరుస బెట్టి సినిమాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి పవన్ హరి హర వీరమల్లు, మహేష్ సర్కారు వారి పాట సినిమాలు పోటా పోటీగా విడుదల కానున్నాయి.

Also Read: టాప్ డైరెక్టర్లని ‘అల్లు’ కు పోతున్న స్టార్ హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -