Wednesday, April 17, 2024
- Advertisement -

వకీల్ సాబ్ ని తెగ మెచ్చుకున్న సూపర్ స్టార్!

- Advertisement -

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లు రాబడుతుంది. ఈ చిత్రం చూసిన తర్వాత మహిళాలోకం వకీల్ సాబ్ పై ప్రశంసల జల్లులలు కురిపిస్తున్నారు.

ఇక టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం పవన్ నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా  ‘వకీల్ సాబ్’పై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించిన ఆయన, లాయర్ గా పవన్ చాలా బాగా నటించారని, ఆయన నటన చాలా పవర్ ఫుల్ గా ఉందని అన్నారు. 

ఇక ప్రకాశ్ రాజ్ సీనియర్ లాయర్ గా తన నటనకు వన్నె తెచ్చారని.. నివేద, అంజలి, అనన్యలు మనసులను హత్తుకునేలా సినిమాలో లీనమయ్యారని అన్నారు. వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తమన్ సంగీతం ఈ మూవీకి ప్లస్ పాయింట్ గా నిలిచింది.

ప్రైవేటు టీచర్లకు రూ. 2 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

ఉత్తర్ ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం..12 మంది మృతి

నేటి పంచాంగం, ఆదివారం (11-4-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -