Saturday, April 27, 2024
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం..12 మంది మృతి

- Advertisement -

దేశంలో రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 45 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన యూపీలోని ఎటావా జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వారంతా కాళికా దేవి ఆలయానికి వెళుతుండంగా బార్‌పురా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ఆగ్రా జిల్లాకు చెందిన సుమారు 60 మంది లఖ్నా ప్రాంతంలోని కాళికా దేవి ఆలయానికి వెళుతున్నారు.  ట్రక్‌పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. ట్రక్ లోయలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని ఎటావా ఎస్పీ బ్రిజేష్ కుమార్ తెలిపారు.క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ప్రమాద వార్త తెలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -