Saturday, April 27, 2024
- Advertisement -

పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అమెజాన్ ప్రైమ్‌లో ‘వకీల్‌ సాబ్‌’

- Advertisement -

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం వకీల్‌ సాబ్‌. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. మూడేళ్ల తర్వాత పవన్‌ వెండితెరపై కనిపించడం, విడుదలైన తొలిరోజు నుంచి పాజిటివ్‌ టాక్‌ రావడంతో వకీల్‌ సాబ్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా విడుదలైన తొలిరోజే రూ.36.46 కోట్ల షేర్, రూ.52.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించించి పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లోనే ఆల్‌ టైమ్‌ రికార్డుగా నిలిచింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ సినిమాకు ఈ రేంజ్‌లో వసూళ్లు రావడం వెనక పవన్ కల్యాణ్‌ ఇమేజ్ ఉందనే విషయం చెప్పక తప్పదు.

ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకుంది. పవన్‌ కల్యాణ్‌కు ఉన్న క్రేజీని దృష్టిలో పెట్టుకొని దాదాపు రూ.30 కోట్లకు ఈ సినిమా డిజిటల్‌ హక్కులను అమెజాన్‌ ప్రేమ్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే రూ.100 కోట్లు కూడా ఇస్తామని ఆఫర్‌ చేసిందట. కానీ నిర్మాత దిల్‌రాజ్‌ మాత్రం అందుకు అంగీకరించలేదట. పవన్‌ రీఎంట్రీ సినిమాను థియేటర్లలోనే విడుదలకే మొగ్గు చూపాడు. దిల్‌రాజ్‌ అంచనా ప్రకారం.. ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ వారంతంలోగా 100 కోట్లను ఈజీగా రాబడుతుంది.

ఇదిలా ఉంటే భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ ఇండియా ఏప్రిల్‌ 23 నుంచి వకీల్‌ సాబ్‌ను ప్రసారం చేయనుందట. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన అన్ని హక్కులు పూర్తైయినట్టు సమాచారం. దీంతో ఇప్పటివరకు పెద్ద తెరపై చూసిన ఈ సినిమాను ఇంకో 12 రరోజుల్లో మొబైల్స్‌లో చూడోచ్చని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘వకీల్‌ సాబ్‌’పై మహేష్‌ బాబు రివ్యూ

గొంతునొప్పిని ఇట్టే త‌గ్గించే చిట్కాలు ఇవిగో !

తిరుపతిలో పవన్‌ సభ సక్సెస్‌, ఆనందంలో వైసీపీ!

నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే మీకు ఆ రోగాలున్న‌ట్టే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -