Wednesday, May 15, 2024
- Advertisement -

ప్రైవేటు టీచర్లకు రూ. 2 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

- Advertisement -

కరోనా, లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూత పడటంతో, జీవనోపాధి లేక ఎంతో మంది టీచర్లు రోడ్డున పడ్డారు. కొంత మంది కూరగాయలు, పండ్లూ అమ్ముకుంటే.. మరికొంత మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరికొంత మంది తమకు ఉన్న భూమి సేద్యం చేసుకుంటున్నారు. పట్టణాల్లో ఉన్న ఎంతో మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు దుర్బరజీవితం గడుపుతున్నారు.

ఈ మద్యనే సాగర్ లో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఆత్మహ్య చేసుకోవడం.. తర్వాత ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం హృదయాలను కలచి వేసింది. ఇక ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.

టీచర్లను ఆదుకునేందుకు నెలకు రూ. 2 వేల సాయాన్ని, తిరిగి పాఠశాలలు తెరిచేంత వరకూ ఇవ్వాలని, దీనికి తోడు అదనంగా 25 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు టీచర్లు ఈ సాయం కోసం ఎలా దరఖాస్తు చేయాలన్న విషయమై అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం నుంచి అక్కడ పనిచేసే టీచర్ల వివరాలను ఆన్ లైన్ మాధ్యమంగా అధికారులు సేకరిస్తారు.

ఈ వివరాలను స్కూళ్ల యాజమాన్యాలు “schooledu.telangana.gov.in” వెబ్ సైట్ లో నమోదు చేయాల్సి వుంటుంది. ఎంఈఓలు, డీఈఓలు తదితర అధికారులు టీచర్ల బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్ఈ కోడ్, ఆధార్ వివరాల పూర్తిగా పరిశీలించి కలెక్టర్ ద్వారా విద్యాశాఖకు వివరాలు పంపుతారు.

టీచర్ల వివరాల నమోదు ప్రక్రియ15వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఆపై 19 వరకూ వాటి పరిశీలన కొనసాగుతుంది. అర్హులైన వారందరికీ 24వ తేదీ లోపు టీచర్ల ఖాతాల్లో రూ. 2 వేలు జమ అవుతుందని, 21 నుంచి 25 లోపు వారికి రేషన్ షాపుల ద్వారా 25 కిలోల బియ్యం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. 

ఉత్తర్ ప్రదేశ్ లో రోడ్డు ప్రమాదం..12 మంది మృతి

నేటి పంచాంగం, ఆదివారం (11-4-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -