Monday, April 29, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కోసం మహేష్ వస్తున్నాడు!

- Advertisement -

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ”జనతా గ్యారేజ్”. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యమీనన్‍లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ను ఈ నెల 12న నందమూరి అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ఈ ఆడియో పంక్షన్ కు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు ని ఆహ్వానించారట. విశ్వసనీయ సమాచారం మేరకు మహేష్ కు ఆహ్వానం అందిందని మహేష్ షూటింగ్ కూడా ఇక్కడే కాబట్టి రావొచ్చని అంటున్నారు. దర్శకుడు కొరటాల శివకు మహేష్ తో శ్రీమంతుడు సినిమా తీసిన విషయం తెలిసిందే.

అలాగే ఎన్టీఆర్ కు మహేష్ అన్నా, మహేష్ కు ఎన్టీఆర్ అన్నా ప్రత్యేక మైన అభిమానం ఉంది దానికి తోడూ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అతను కూడా వస్తున్నాడు కాబట్టి జనతా గ్యారేజ్ ఆడియో కు మహేష్ రానున్నట్లు తెలుస్తోంది. మహేష్ ఈ వేడుకకు వస్తే మహేష్ ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే.

Related

  1. ఎన్టీఆర్ కి రాజమౌళి షాక్!
  2. టెంపర్ కి మించిన రోల్ లో ఎన్టీఆర్
  3. మహేష్ సినిమాలో నమ్రత ఏ రోల్ చేస్తుందటే?
  4. ఈ అలవాటు మహేష్ కు ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -