Friday, April 19, 2024
- Advertisement -

ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్.. చిరంజీవి షాకింగ్ నిర్ణయం?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఫ్యామిలీకి ఉన్న ఆదరణ, ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ సినిమాల్లోనే కాకుండా వాస్తవిక జీవితంలో కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సమాజసేవా కార్యక్రమాలతో రియల్ హీరో గా నిలిచాడు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సీనియర్ నటి శ్యామల ఆర్థిక పరిస్థితులపై స్పందించి ఆమెకు సహాయం అందించిన విషయం తెలిసిందే.

తాజాగా చిరంజీవి మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆక్సిజన్ కొరత. ఆక్సిజన్ కొరత కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల కష్టాలను తీర్చడానికి చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ నిర్మించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతలను చిరంజీవి అభిమాన సంఘాలకు అప్పగించనున్నట్లు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఓ పోస్ట్ చేసింది. చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also read:వెళ్లి వాళ్లని అడుక్కోడంటూ ఫైర్ అయిన నటి రేణు దేశాయ్?

ప్రస్తుతం చిరంజీవి “ఆచార్య ” వంటి భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిరంజీవి తదుపరి సినిమా “లూసిఫర్” రీమేక్ చిత్రంలో నటించాలని ప్లాన్ చేస్తున్నారు .ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కొణిదేల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Also read:అది మాటల్లో చెప్పలేని బాధ.. ఆందోళనలో నటి పాయల్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -