Saturday, April 20, 2024
- Advertisement -

రికార్డు బద్దలుకొట్టిన ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్..?

- Advertisement -

దాదాపు రెండు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్న ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ చూడని సినీ ప్రేమికులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన ఫ్యామిలీ మెన్ విజయవంతం కావడంతో మేకర్స్ రాజ్ అండ్ డీకే, చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సిరీస్ కి సీక్వెల్ గా, రెండవ సీజన్ చేయడం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు.

ఈ సిరీస్ సీక్వెల్ కోసం ప్రత్యేకంగా సమంతకు ఓ స్పెషల్ రోల్ డిజైన్ చేశారు. అన్ని హంగులతో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సిరీస్ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఫ్యామిలీ మెన్ సీజన్ 2 ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ వదిలిన 24 గంటల్లోనే ఏకంగా 15 మిలియన్ వ్యూస్ సంపాదించుకొని రికార్డును బద్దలు కొట్టింది.

Also read:పావలా శ్యామలకు సాయం చేసిన మెగాస్టార్.. ప్రతి నెల?

మొదటి సీజన్‌లో మనోజ్ తివారి, ప్రియమణి హైలెట్ అయితే,ఈ సీజన్‌లో సమంత హైలెట్ అయ్యేలా ఉంది. ఈ వెబ్ సిరీస్ ద్వారా సమంత క్రేజ్ మరింత పెరుగుతుందని ప్రేక్షకుల అంచనా వేస్తున్నారు.సమంత అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు డీగ్లామర్ రోల్ సమంత కు మంచి క్రేజ్ సంపాదించి పెట్టనున్నాయని తెలుస్తోంది. నేషనల్ వైడ్ గా ఈ వెబ్ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Also read:వెళ్లి వాళ్లని అడుక్కోడంటూ ఫైర్ అయిన నటి రేణు దేశాయ్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -